ENG vs SA: దక్షిణఫ్రికాతో మూడో టెస్టు.. విజయం దిశగా ఇంగ్లండ్!

లండన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో ఇంగ్లండ్ విజయానికి చేరువైంది. మ్యాచ్ నాలుగో రోజు 130 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 97 పరుగులు సాధించింది. ఓపెనర్లు అలెక్స్ లీస్ (32 బ్యాటింగ్), జాక్ క్రాలీ (57 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. నేడు మరో 33 పరుగులు చేస్తే ఇంగ్లండ్ గెలుస్తుంది.
అంతే కాకుండా మూడు టెస్టుల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంటుంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 154/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ మరో నాలుగు పరుగులు జోడించి 158 పరుగులవద్ద ఆలౌటైంది. 40 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 169 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లు బ్రాడ్ (3/45), స్టోక్స్ (3/39), అండర్సన్ (2/37), ఒలీ రాబిన్సన్ (2/40) రాణించారు.
చదవండి: Asia Cup 2022 Final: అలా అయితే రాజపక్స 70 పరుగులకు విలువే ఉండేది కాదు! కానీ..: పాక్ మాజీ కెప్టెన్
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు