అజింక్య రహానే చెత్త రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలోనే | Ajinkya Rahane Creates Unwanted Record | Sakshi
Sakshi News home page

IPL 2026: అజింక్య రహానే చెత్త రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలోనే

Apr 19 2026 6:38 PM | Updated on Apr 19 2026 6:49 PM

Ajinkya Rahane Creates Unwanted Record

ఐపీఎల్‌-2026లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కెప్టెన్ అజింక్య ర‌హానే త‌న పేల‌వ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఈ ధ‌నాధ‌న్ లీగ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ర‌హానే ఖాతా తెవ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరాడు. రాజ‌స్తాన్ పేస‌ర్ నండ్రీ బ‌ర్గ‌ర్ బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్‌కు క్యాచ్ ఇచ్చి ర‌హానే ఔట‌య్యాడు.

అంత‌కుముందు గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కూడా ర‌హానే గోల్డెన్ డ‌క్‌గా వెనుదిరిగాడు. తద్వారా ఈ వెట‌ర‌న్ ఆట‌గాడు ఓ అవాంఛ‌నీయ రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన ఓపెన‌ర్‌గా ర‌హానే నిలిచాడు. ర‌హానే ఇప్ప‌టివ‌ర‌కు 12 సార్లు ఖాతా తెర‌వ‌కుండానే ఔట‌య్యాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు మాజీ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ పార్ధివ్ ప‌టేల్‌(11) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో పార్ధివ్‌ను ర‌హానే అధిగ‌మించాడు.

ఐపీఎల్‌లో అత్య‌ధిక సార్లు డ‌కౌటైన ఓపెన‌ర్లు వీరే
12 - అజింక్య రహానే*
11 - పార్థివ్ పటేల్
10 - శిఖర్ ధావన్
10 - గౌతమ్ గంభీర్
9 - డేవిడ్ వార్నర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement