Naseem Shah: బ్యాటర్ కొంపముంచిన బంతి.. వీడియో వైరల్

టి20 క్రికెట్‌లో అఫ్గానిస్తాన్ జట్టు పాకిస్తాన్‌పై తొలిసారి విజయం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి జరిగిన తొలి టి20లో అఫ్గానిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మహ్మద్ నబీ తొలుత బౌలింగ్(2/12).. తర్వాత బ్యాటింగ్‌లో (38 పరుగులు నాటౌట్) రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో టి20 మార్చి 26న(ఆదివారం) జరగనుంది.
ఈ విషయం పక్కనబెడితే.. పాకిస్తాన్ బౌలర్ నసీమ్ షా ఔటైన విధానం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో నసీమ్ షా హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే హిట్‌వికెట్ అవ్వడంలో తన తప్పు లేదు. మహ్మద్ నబీ వేసిన గుడ్ లెంగ్త్ డెలివరీని ఆడే క్రమంలో మిస్ అయ్యాడు. దీంతో బంతి అతని పొట్ట బాగానికి తగలడంతో బ్యాలెన్స్ కోల్పోయాడు. దీంతో బ్యాట్ వెళ్లి వికెట్లను గిరాటేసింది.
ఇది ఊహించని నసీమ్ షా ఇచ్చిన రియాక్షన్ బాధ కలిగించినా అతని చర్య నవ్వు తెప్పించింది. చేసేదేం లేక తెగ బాధపడుతూ నసీమ్ పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియోపై ఒకసారి లుక్కేయండి.
.@MohammadNabi007 Strikes again - Naseem Shah departs 🤩
Naseem swung hard but lost his balance in the process as he's gone back to hit his stumps
🇵🇰- 71/8 (15.4 Overs)#AfghanAtalan | #AFGvPAK | #LobaBaRangRawri pic.twitter.com/F2x0EmbDAR
— Afghanistan Cricket Board (@ACBofficials) March 24, 2023
చదవండి: IPL 2023: ఏకకాలంలో బ్యాటింగ్, బౌలింగ్.. ధోనికి మాత్రమే సాధ్యం!
మరిన్ని వార్తలు :
మరిన్ని వార్తలు