AFG Vs PAK: పాక్‌కు ఘోర అవమానం.. చరిత్ర సృష్టించిన అఫ్గానిస్తాన్

పాకిస్తాన్ జట్టుకు అఫ్గానిస్తాన్ షాక్ ఇచ్చింది. శుక్రవారం జరిగిన తొలి టి20లో ఆఫ్గన్ ఆరు వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. సీనియర్లు లేని లోటు పాక్ జట్టుపై ప్రభావం చూపించింది. షాదాబ్‌ఖాన్ కెప్టెన్సీలో ఘోర ప్రదర్శన కనబరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.
ఇమాద్ వసీమ్(18), షాదాబ్ ఖాన్(23), సయీమ్ అయూబ్(17), తయూబ్ తాహిర్(16) రెండంకెల స్కోరు దాటగా మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. ఆఫ్గన్ బౌలర్లలో ముజీబ్, నబీ, ఫజల్లా ఫరుఖీలు రెండు వికెట్లు తీయగా.. అజ్మతుల్లా, నవీన్ హుల్ హక్, రషీద్ ఖాన్‌లు తలా ఒక వికెట్ తీశారు.
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 17.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. మహ్మద్ నబీ 38 పరుగులు నాటౌట్ జట్టును గెలిపించాడు. నజీబుల్లా జర్దన్ 17 నాటౌట్, రహమనుల్లా గుర్బాజ్ 16 పరుగులు చేశారు. ఇషానుల్లా రెండు వికెట్లు తీయగా.. నసీమ్ షా, ఇమాద్ వసీమ్‌లు చెరొక వికెట్ తీశారు.
ఇక టి20ల్లో పాకిస్తాన్‌ను ఓడించడం అఫ్గానిస్తాన్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక పాకిస్తాన్‌కు టి20ల్లో ఇది ఐదో అత్యల్ప స్కోరు. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన మహ్మద్ నబీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇరుజట్ల మధ్య జరిగిన రెండో టి20 మార్చి 26న(ఆదివారం) జరగనుంది.
Mohammad Nabi - The PoTM 🔥
Watch what the man of the moment, @MohammadNabi007, had to say after he stole the show with his (38* (38) & 2/12) incredible all-round performance to take Afghanistan to an incredible historic win. 🤩#AfghanAtalan | #AFGvPAK | #LobaBaRangRawri pic.twitter.com/bCggEWbsxW
— Afghanistan Cricket Board (@ACBofficials) March 24, 2023
This was the 𝓜𝓞𝓜𝓔𝓝𝓣! 👌
The President @MohammadNabi007 finished the job in some style to make history and win the game for Afghanistan. 🤩🔥#AfghanAtalan | #AFGvPAK | #LobaBaRangRawri pic.twitter.com/QPdMimCEdB
— Afghanistan Cricket Board (@ACBofficials) March 24, 2023
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు