క్రికెట్‌లో 13 మ్యాచ్‌లు ఫిక్సింగ్‌.. టీమిండియా సేఫ్‌!

Sportradar Report-13-Cricket Matches-Suspicion-Corruption-Match-Fixing - Sakshi

అంతర్జాతీయ క్రీడా సంస్థ స్పోర్ట్‌రాడార్‌ 2022 ఏడాదిలో అవినీతి, మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగిన మ్యాచ్‌ల వివరాలను వెల్లడించింది. ఈ నివేదికలో 13 క్రికెట్‌ మ్యాచ్‌ల్లో అవినీతి, మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగినట్లు ఆరోపించడం ఆసక్తి కలిగించింది. స్విట్జర్లాండ్‌ కేంద్రంగా పనిచేసే స్పోర్ట్‌రాడార్‌కు చెందిన నిపుణులు రెగ్యులర్‌ బెట్టింగ్‌, మ్యాచ్‌ ఫిక్సింగ్‌, అవినీతి కార్యకలపాలపై తమ పరిశోధన నిర్వహించారు. దీనికి సంబంధించి 28 పేజీలతో ఒక రిపోర్ట్‌ను విడుదల చేసింది.

2022 ఏడాది క్యాలెండర్‌లో మొత్తంగా 1212 మ్యాచ్‌లపై వివిధ కోణాల్లో అనుమానాలున్నాయని పేర్కొంది. ఇందులో 92 దేశాలకు చెందిన 12 ఆటలు ఉన్నాయి. అత్యధికంగా ఫుట్‌బాల్‌ నుంచి 775 మ్యాచ్‌లు అవినీతి లేదా ఫిక్సింగ్‌ రూపంలో ఉన్నాయి. ఆ తర్వాత రెండో స్థానంలో బాస్కెట్‌బాల్‌ గేమ్‌ ఉంది. ఈ బాస్కెట్‌బాల్‌ నుంచి 220 మ్యాచ్‌లు ఉన్నాయి. ఆ తర్వాత 75 అనుమానాస్పద మ్యాచ్‌లతో టెన్నిస్‌ మూడో స్థానంలో ఉంది.

ఇక క్రికెట్‌లో 13 మ్యాచ్‌లపై అనుమానాలు ఉన్నట్లు తెలిపిన స్పోర్ట్‌రాడార్‌ ఆరోస్థానం కేటాయించింది. క్రికెట్‌లో 13 మ్యాచ్‌లు ఫిక్సింగ్‌ లేదా అవినీతి జరగడం ఇదే తొలిసారి అని తెలిపింది. ఇదే విషయమై పీటీఐ స్పోర్ట్‌ రాడార్‌ను ఒక ప్రశ్న వేసింది. ఈ ఫిక్సింగ్‌ జరిగింది అంతర్జాతీయ క్రికెట్‌ లేక టి20 లీగ్‌ల్లోనా అని పీటీఐ ప్రశ్నించింది.

దీనికి స్పోర్ట్‌రాడార్‌  స్పందిస్తూ ఫిక్సింగ్‌గా అనుమానిస్తున్న 13 మ్యాచ్‌లు టీమిండియాకు కానీ.. ఐపీఎల్‌కు కానీ సంబంధం లేదని తెలిపింది. ఇదే స్పోర్ట్‌ రాడార్‌ సంస్థ 2020లో ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా బీసీసీఐ యాంటీ కరప్షన్‌ యూనిట్‌లో పనిచేసింది. బెట్టింగ్‌లో జరుగుతున్న అక్రమాలపై తమ పరిశోధన చేసి బీసీసీకి నివేధిక అందించింది.

చదవండి: ఇంగ్లండ్‌ బౌలర్‌ చరిత్ర.. డబ్ల్యూపీఎల్‌లో తొలి హ్యాట్రిక్‌

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top