Issy Wong: ఇంగ్లండ్‌ బౌలర్‌ చరిత్ర.. డబ్ల్యూపీఎల్‌లో తొలి హ్యాట్రిక్‌

WPL 2023: Issy Wong Takes First-Ever Hat-Trick For-MI Vs UP Warriorz - Sakshi

మహిళల ప్రీమియర్‌ లీగ్‌(WPL 2023)లో ముంబై ఇండియన్స్‌ వుమెన్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం యూపీ వారియర్జ్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో డబ్ల్యూపీఎల్‌లో తొలి హ్యాట్రిక్‌ నమోదైంది. ఇంగ్లండ్‌ బౌలర్‌ ఇసీ వాంగ్‌ ఈ ఫీట్‌ను సాధించింది. 

యూపీ వారియర్జ్‌ ఇన్నింగ్స్‌ సమయంలో 56/4తో కష్టాల్లో నిలిచి కోలుకునే ప్రయత్నం చేస్తున్న దశలో ఇసీ వాంగ్‌ దెబ్బతీసింది. ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో వరుస మూడు బంతుల్లో నవ్‌గిరే, సిమ్రన్‌ షేక్, సోఫీ ఎకెల్‌స్టోన్‌లను అవుట్‌ చేసి ‘హ్యాట్రిక్‌’ సాధించింది. ఈ దెబ్బతో యూపీ వారియర్జ్‌ ఓటమి ఖరారైపోయింది.

ఇక డబ్ల్యూపీఎల్‌లో ఇదే తొలి హ్యాట్రిక్‌ కాగా.. ఐపీఎల్‌లో మాత్రం ఇప్పటివరకు 21సార్లు హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. ఇక 2008 తొలి సీజన్‌లో సీఎస్‌కే బౌలర్‌ లక్ష్మీపతి బాలాజీ ఐపీఎల్‌లో తొలి హ్యాట్రిక్‌ సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఇక ఐపీఎల్‌లో అత్యధికంగా అమిత్‌ మిశ్రా మూడుసార్లు హ్యాట్రిక్‌ తీయగా.. యువరాజ్‌ సింగ్‌ రెండుసార్లు హ్యాట్రిక్‌ ఫీట్‌ సాధించాడు.

చదవండి: పాక్‌కు ఘోర అవమానం.. చరిత్ర సృష్టించిన అఫ్గానిస్తాన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top