AsiaCup 2023: కొత్త ట్విస్ట్‌.. పాక్‌ లేకుండానే టోర్నీ నిర్వహణ!

ACC Gears-Up For Asia Cup 2023 Without Pakistan  - Sakshi

ఆసియా కప్ 2023 విషయమై ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య సయోధ్య కుదిరేలా సూచనలు కనిపించడం లేదు. ఆసియా కప్‌ను హైబ్రిడ్‌ మోడ్‌లో నిర్వహించి తమ పంతం నెగ్గించుకోవాలని చూసిన పీసీబీకి చుక్కెదురైనట్లు తెలుస్తోంది. హైబ్రిడ్‌ మోడ్‌ ప్రకారం పాక్‌లో కొన్ని మ్యాచ్‌లు.. భారత్‌ ఆడే  మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించాలని పీసీబీ భావించింది. కానీ హైబ్రిడ్‌ మోడ్‌కు బీసీసీఐ అంగీకరించలేదని.. ఆ సమయంలో దుబాయ్‌లో వేడి ఎక్కువగా ఉంటుందని.. ఆటగాళ్లు తట్టుకోలేరని ఏసీసీకి బీసీసీఐ వివరించినట్లు సమాచారం. ఏసీసీలో భాగంగా ఉన్న ఇతర దేశాలు కూడా పాక్‌ ప్రతిపాదించిన హైబ్రీడ్‌ మోడ్‌కు ఒప్పుకోనట్లు తెలిసింది.

దీంతో పాకిస్తాన్‌ లేకుండానే ఆసియా కప్‌ జరగనున్నట్లు తెలిసింది. రిపోర్టు ప్రకారం, టోర్నమెంట్‌కు అధికారిక హోస్ట్ అయిన పాకిస్థాన్ మినహా ఆసియా కప్‌ ఆడేందుకు ఏసీసీ సభ్యులందరూ అంగీకరించినట్లు తెలిసింది. పాకిస్థాన్ కాకుండా వేరే దేశంలో ఆసియా కప్ నిర్వహించేందుకు అంగీకరించినట్లు సమాచారం. కానీ పాకిస్థాన్ మాత్రం హైబ్రిడ్ మోడల్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. అందువల్ల పాకిస్థాన్ తన నిర్ణయాన్ని సడలించకపోతే ఈసారి పాక్ జట్టు లేకుండానే ఆసియాకప్ జరగనుంది.

ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) రాబోయే ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో పాల్గొనే ఇతర దేశాలన్నీ శ్రీలంకలో ఆసియా కప్ ఆడేందుకు ఏకగ్రీవంగా అంగీకరించినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి స్పష్టమైన సందేశం పంపే అవకాశాలు ఉన్నాయి. అలాగే, శ్రీలంకలో ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి పాకిస్థాన్ కాకుండా ఇతర దేశాల నుంచి మద్దతు ఎక్కువగా ఉన్నందున ఏసీసీ నిర్ణయాన్ని అంగీకరించడం లేదా పూర్తిగా వైదొలగడం మినహా పాకిస్థాన్‌కు ఇప్పుడు వేరే మార్గం లేదు.

ఒకవేళ ఈ ఈవెంట్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పాల్గొనకపోతే భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్‌లు శ్రీలంక వేదికగా ఆసియా కప్‌లో ఆడతాయి. అయితే ఇప్పుడు పాకిస్థాన్‌ హైబ్రిడ్ మోడల్‌ను భారత్ తిరస్కరిస్తే.. అక్టోబర్, నవంబర్‌లలో భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ వైదొలిగే అవకాశం ఉంది. అయితే ఇది పాకిస్తాన్‌కే నష్టం చేకూర్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఆసియా కప్‌ సెప్టెంబర్‌ 2 నుంచి 17 వరకు జరిగే నిర్వహించే యోచనలో ఏసీసీ ఉంది.

చదవండి: విధ్వంసకర ఇన్నింగ్స్‌.. 38 బంతుల్లోనే సెంచరీ

శ్రీలంకలో ఆసియాకప్‌.. జరుగుతుందా? లేదా?

ఫామ్‌లో ఉన్నాడు.. రికార్డులు బద్దలు కొట్టడం కష్టమేమి కాదు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top