IND vs WI: అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డు | Abhishek Sharma scripts history, breaks Suryakumar Yadavs record for most T20I sixes in a calendar yea | Sakshi
Sakshi News home page

IND vs WI: అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డు

Oct 15 2026 1:05 AM | Updated on Oct 15 2026 1:56 AM

Abhishek Sharma scripts history, breaks Suryakumar Yadavs record for most T20I sixes in a calendar yea

అభిషేక్‌ శర్మ(ఫైల్‌ ఫోటో)

ఉప్ప‌ల్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అభిషేక్ శ‌ర్మ నిరాశ‌ప‌రిచాడు. త‌న‌కు క‌లిసొచ్చే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో అభిషేక్ ఈసారి మెరుపులు మెరిపించ‌లేక‌పోయాడు. 24 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ కేవ‌లం 29 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు.

అయితే అభిషేక్ నామ‌మాత్ర‌పు స్కోర్ సాధించిన‌ప్ప‌టికి ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒకే క్యాలెండ‌ర్ ఈయ‌ర్‌లో ఫుల్ మెంబ‌ర్ టీమ్ త‌ర‌పున ఆడుతూ అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన ప్లేయ‌ర్‌గా అభిషేక్ నిలిచాడు.

సూర్యకుమార్ యాదవ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్

ష‌మీర్ స్ప్రింగ‌ర్ బౌలింగ్‌లో సిక్స‌ర్ బాద‌డంతో అభిషేక్ ఈ ఫీట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాదిలో అత‌డికి ఇది 69వ సిక్స‌ర్‌. ఇంత‌కుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్‌ సూర్య‌కుమార్ యాద‌వ్ పేరిట ఉండేది.  2022లో సూర్యకుమార్ మొత్తం 68 సిక్సర్లు బాదగా, తాజా ఇన్నింగ్స్‌తో అభిషేక్ ఆ రికార్డును బ్రేక్ చేసి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు.

షాయ్ హోప్ వీరోచిత శతకం.. భార‌త్ ఓట‌మి

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ వీరోచిత శ‌త‌కంతో చెల‌రేగాడు. హోప్ కేవలం 50 బంతుల్లోనే 102 పరుగులతో అజేయంగా నిలిచాడు. అత‌డితో పాటు షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ 26 బంతుల్లో 49 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

వీరిద్దరూ నాలుగో వికెట్‌కు కేవలం 43 బంతుల్లోనే 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంత‌రం ఈ భారీ ల‌క్ష్యంతో బరిలోకి దిగిన భార‌త్ 223 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఓట‌మి పాలైంది. భారత బ్యాటర్లలో సంజూ శాంసన్‌ (56) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. తిలక్‌ వర్మ (43), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (41) గెలుపు కోసం తమ వంతు ప్రయత్నం చేశారు.
చదవండి: IND vs WI: ఉప్పల్‌ 'హోప్‌' పాలు...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement