రోహిత్‌ అసలేం చేశావు.. అతడితో ఎందుకు బౌలింగ్‌ చేయించలేదు? | Aakash Chopra questions Rohit Sharmas captaincy | Sakshi
Sakshi News home page

రోహిత్‌ అసలేం చేశావు.. అతడితో ఎందుకు బౌలింగ్‌ చేయించలేదు?

Oct 21 2024 12:57 PM | Updated on Oct 21 2024 2:49 PM

Aakash Chopra questions Rohit Sharmas captaincy

న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను భార‌త్ ఓట‌మితో ఆరంభించిన విష‌యం తెలిసిందే. బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టెస్టులో 8 వికెట్ల తేడాతో టీమిండియా ప‌రాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ త‌న మార్క్‌ను చూపించ‌లేక‌పోయాడు. టాస్ ద‌గ్గ‌ర నుంచి బౌల‌ర్ల ఎంపిక వ‌ర‌కు రోహిత్ నిర్ణ‌యాలు బెడిసి కొట్టాయి. 

తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్ కంటే ముందు కోహ్లిని బ్యాటింగ్‌కు పంప‌డం, ముగ్గురు స్పిన్న‌ర్ల‌తో బ‌రిలోకి దిగడం, కివీస్ టెయిలాండర్ టిమ్ సౌథీ భార‌త స్పిన్నర్ల‌పై విరుచుకుప‌డుతున్న‌ప్పుడు బుమ్రాతో బౌలింగ్ చేయించ‌క‌పోవ‌డం వంటివి రోహిత్ చేసిన త‌ప్పిదాలగా క్రికెట్ పండితులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఈ నేప‌థ్యంలో రోహిత్ కెప్టెన్సీపై భార‌త మాజీ క్రికెట‌ర్ ఆకాష్ చోప్రా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించాడు. కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఆల‌స్యంగా ఎటాక్‌లోకి తీసుకురావ‌డాన్ని చోప్రా త‌ప్పు బ‌ట్టాడు.

"అంత త‌క్కువ టార్గెట్‌ను డిఫెండ్ చేసుకోవ‌డం అంత సుల‌భం కాదు. ఈ విష‌యం నాకు కూడా తెలుసు. కానీ అశ్విన్‌తో కేవ‌లం రెండు ఓవ‌ర్లు మాత్ర‌మే బౌలింగ్ చేయించ‌డం న‌న్ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. 

అశ్విన్ బౌలింగ్ చేసి ఉంటే మ్యాచ్ మ‌న‌దే అని నేను చెప్ప‌డం లేదు. కానీ అత‌డు వ‌ర‌ల్డ్‌లోనే అత్యుత్త‌మ స్పిన్న‌ర్ల‌లో ఒక‌డు. టీమ్‌లో కూడా అశ్విన్ మించిన‌వారే లేరు. టెస్టుల్లో అతని కంటే ఎక్కువ వికెట్లు ఎవరూ తీయలేదు. 

లెఫ్ట్ హ్యాండ‌ర్ల‌పై కూడా అశూకు మంచి రికార్డు ఉంది.  ఎడమచేతి వాటం ఆటగాళ్ళు క్రీజులో ఉన్న‌ప్పుడు కూడా అత‌డిని ఎటాక్‌లోకి తీసుకు రాలేదు. అస్స‌లు ఎందుకు అలా చేయ‌లేక‌పోయారో ఎవ‌రికీ ఆర్ధం కావ‌డం లేదంటూ" త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో చోప్రా పేర్కొన్నాడు.
చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్‌.. రెండో టెస్టుకు డేంజరస్‌ ప్లేయర్‌ దూరం!?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement