SA vsIND: "టీమిండియా వన్డే వైస్‌ కెప్టెన్‌గా జస్ప్రీత్‌ బుమ్రా.. ఇది అద్భుతమైన నిర్ణయం"

Aakash Chopra on comments on Jasprit Bumrah appointment as Team India vice captain  - Sakshi

దక్షిణాఫ్రికాతో త్వరలో జరగనున్న 3 వన్డేల సిరీస్‌కు టీమిండియా జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. కాగా గాయం కారణంగా వన్డే సిరీస్‌కు రోహిత్‌ దూరం కావడంతో.. కేఎల్‌ రాహుల్‌ను కెప్టెన్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. అదే విధంగా జట్టు స్టార్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకి వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పారు. ఈ నేపథ్యంలో బుమ్రాను వైస్‌ కెప్టెన్‌గా నియమియండం పట్ల భారత మాజీ క్రికెటర్‌ ఆకాష్‌ చోప్రా హర్షం వ్యక్తం చేశాడు. బుమ్రాను నియమిస్తూ బీసీసీఐ అధ్బుతమైన నిర్ణయం తీసుకుందని అతడు తెలిపాడు.

"దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు జస్ప్రీత్‌ బుమ్రాని వైస్‌ కెప్టెన్‌గా నియమించడం చాలా సంతోషంగా ఉంది. అతడికి భారత జట్టు వైస్‌ కెప్టెన్సీ భాధ్యతలు అప్పజెప్పుతూ బీసీసీఐ సెలెక్టర్లు మరోసారి అధ్బుతమైన నిర్ణయం తీసుకున్నారు. బుమ్రాకు ఇది తొలి మెట్టు, ఈ అవకాశాన్ని అతడు సద్వినియోగ పరుచుకుంటాడని నేను భావిస్తున్నాను" అని అతడు పేర్కొన్నాడు. కాగా జట్టులో మువ ఆటగాళ్లు శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌కు ఐపీఎల్‌లో కెప్టెన్‌గా చేసిన అనుభవం ఉన్నప్పటికీ..  బుమ్రా వైపే సెలెక్టర్లు మెగ్గు చూపారు. 

దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భారత వన్డే జట్టు: కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), శిఖర్‌ ధవన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), చహల్‌, ఆర్‌ అశ్విన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, బుమ్రా(వైస్‌ కెప్టెన్‌), భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, శార్ధూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌

చదవండి: పవర్‌ హిట్టింగ్‌ బ్యాటింగ్‌ కోచ్.. ఏ జట్టుకో తెలుసా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top