కోహ్లి బర్త్‌డే: నెటిజన్లు ఏం అడుగుతున్నారంటే! | Indians Searching Virat Kohli Phone Number on Google Birthday | Sakshi
Sakshi News home page

కోహ్లి పర్సనల్‌ నంబర్ అ‌డుగుతున్న నెటిజన్లు!

Nov 5 2020 2:37 PM | Updated on Nov 5 2020 4:27 PM

​Indians Searching Virat Kohli Phone Number on Google Birthday - Sakshi

తమ ఆరాధ్య క్రికెటర్‌ బర్త్‌డేను మరింత ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకునేందుకు అభిమానులు ‘గూగుల్‌ తల్లి’ సాయం అడుగుతున్నారు.

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి నేడు 32వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా అభిమానులు, సహచర ఆటగాళ్ల నుంచి ఈ రన్‌ మెషీన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. #HappyBirthdayViratKohili హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్‌లో మోత మోగుతోంది. అయితే కొంతమంది వీరాభిమానులు మాత్రం సోషల్‌ మీడియా వేదికగా విషెస్‌ చెబితే కిక్కేం ఉంటుంది.. వీలైతే కోహ్లి ఫోన్‌ నంబర్‌ సంపాదించి పర్సనల్‌గానే విష్‌ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్‌ బర్త్‌డేను మరింత ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకునేందుకు ‘గూగుల్‌ తల్లి’ సాయం అడుగుతున్నారు. దీంతో గూగుల్‌ ఇండియా సెర్చ్‌లో కోహ్లి పర్సనల్‌ నంబర్‌కు సంబంధించిన అంశం ట్రెండింగ్‌లో నిలిచింది. టాప్‌ సర్చింగ్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తర్వాతి స్థానంలో ‘విరాట్‌ కోహ్లి ఫోన్‌ నంబర్‌’ ట్రెండ్‌ అవుతోంది.(చదవండి: కోహ్లీకి ఎమోషనల్‌ బర్త్ డే విషెస్‌‌)

కాగా 1988 నవంబర్‌ 5 వతేదీన ఢిల్లీలో జన్మించిన విరాట్‌ కోహ్లి అంచెలంచెలుగా ఎదిగి టీం ఇండియా కెప్టెన్‌గా ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. ఆస్ట్రేలియాలో 2008లో జరిగిన ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్‌లో సెంచరీ సాధించిన తర్వాత, కోహ్లి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఇద్దరూ గాయపడినప్పుడు 2008లో శ్రీలంకతో ఆడిన ఐడియా కప్‌ ద్వారా మొదటిసారి వన్డే మ్యాచ్‌ ఆడిన అతడు.. ఆపై వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇక ఇప్పటి వరకు కోహ్లీ భారత్ తరఫున 86 టెస్టులు, 248 వన్డేలు, 82 టీ 20 లకు ప్రాతినిథ్యం వహించిన కోహ్లి.. టెస్టుల్లో 7,240 పరుగులు, వన్డేల్లో 11,867 పరుగులు, టీ 20 లలో 2,794 పరుగులు చేసి అత్యుత్తమ క్రికెటర్‌గా నీరాజనాలు అందుకుంటున్నాడు. అదే విధంగా.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ.. జట్టును ముందుకు నడిపిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement