కోహ్లీకి ఎమోషనల్‌ బర్త్ డే విషెస్‌‌ | To The Man whos Given Blood Tears To The Red And Gold | Sakshi
Sakshi News home page

కోహ్లీకి ఎమోషనల్‌ బర్త్ డే విషెస్‌‌

Nov 5 2020 12:29 PM | Updated on Nov 5 2020 2:42 PM

To The Man who’s Given Blood, Tears To The Red And Gold. - Sakshi

దుబాయ్‌: విరాట్ కోహ్లీ 32వ జన్మదిన వేడుకుల సందర్భంగా గురువారం తన టీమ్‌ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (ఆర్‌సీబీ) ట్విటర్‌ వేదికగా ఎమోషనల్‌ బర్త్‌ డే విషెస్‌ చెప్పింది. జట్టు  గెలుపు కోసం రక్తాన్ని, స్వేదాన్ని, కన్నీళ్లను ఇచ్చే గొప్ప వ్యక్తి  అని ట్వీట్‌ చేసింది. మా నాయకుడు లెజెండ్‌ అని ప్రశింసిస్తూ.. ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. జన్మదిన వేడుకలు గొప్పగా ఉండాలని ఆశించింది. 2008 ఐపిఎల్‌ ప్రారంభం నుంచి లీగ్‌లో ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంది. ఐపీఎల్‌ అధికారక ట్విటర్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన వీడియోను షేర్‌ చేసింది. హ్యాపీ బర్త్‌ డే  ఇండియన్‌ గ్రేట్‌ బ్యాట్స్‌మెన్‌, నువ్వు  ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని, సిక్సర్లు బాదాలని యువరాజ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశాడు. సురేశ్‌ రైనా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరిన్ని విజయాలు సాధించాలని కోరుతున్నానన్నాడు. శిఖర్‌ ధావన్‌, వివిఎస్‌ లక్క్ష్మణ్‌ పలువురు ట్విటర్‌ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. క్రికెటర్లతో పాటు... యావత్‌ ప్రపంచమంతా తన అభిమాన క్రికెటర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

విరాట్‌ కోహ్లీ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 191మ్యాచ్‌లు ఆడాడు. 5872 పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో లీగ్‌ దశలో  460 పరుగులు చేశాడు. 2016 తర్వాత ప్లేఆఫ్‌కి  వెళ్లడానికి కోహ్లీ చేసిన పరుగులు చాలా కీలకమయ్యాయి. శుక్రవారం ఎలిమినేషన్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌తో తలపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement