Football: కుప్పకూలి.. యువ ఆటగాడు కన్నుమూత

22-year-old Columbian Footballer Dies After Collapsing Training Session - Sakshi

కొలంబియా ఫుట్‌బాల్‌ జట్టులో విషాదం నెలకొంది. ఆ జట్టు మిడ్‌ఫీల్డర్‌ 22 ఏళ్ల ఆండ్రెస్ బలంతా కన్నుమూశాడు. ఇటీవలే అట్లెటికో టుకుమన్‌ ట్రెయినింగ్‌ సెషన్‌లో ఆండ్రెస్‌ పాల్గొన్నాడు. ట్రెయినింగ్‌ సెషన్‌ జరుగుతుండగానే ఆండ్రెస్‌ బలంతా ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో భయపడిన నిర్వాహకులు ఆండ్రెస్‌ను టుకుమన్‌ హెల్త్‌ సెంటర్‌ ఆసుపత్రిలో చేర్చారు. కాగా చికిత్స తీసుకుంటూనే మంగళవారం గుండెపోటుతో ఆండ్రెస్‌ మరణించినట్లు వైద్యులు ద్రువీకరించారు. ఎంత ప్రయత్నించినా ఆండ్రెస్‌ను కాపాడలేకపోయామని వైద్యులు పేర్కొన్నారు.

ఇక 2021-22 సీజన్‌లో అట్లెటికో టుకుమన్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆండ్రెస్‌ బలంతా ఏడు మ్యాచ్‌లు ఆడాడు. కాగా ఆండ్రెస్‌ మృతిపై కొలంబియా ఫుట్‌బాల్ జట్టు తమ సంతాపం తెలిపింది. ఇక మాంచెస్టర్‌ సిటీ దిగ్గజం సెర్జియో ఆగురో ఆండ్రెస్‌ మృతిపై విచారం వ్యక్తం చేశాడు. ''బలంతా చనిపోవడం బాధాకరం. అతని ఆరోగ్య పరిస్థితి దృశ్యా వైద్యులు ఇకపై ఆండ్రెస్‌ ఫుట్‌బాల్‌ ఆడేందుకు వీల్లేదని చెప్పారు. కానీ ఇంతలోనే మృతి చెందడం ఎంతో బాధ కలిగిస్తుంది. ఆ స్థానంలో నేనున్నా బాగుండేది.. భరించడం కష్టంగా ఉంది. మిస్‌ యూ ఆండ్రెస్‌ బలంతా'' అంటూ కన్నీటిపర్యంతం అయ్యాడు.

ఇక ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌కు కొలంబియా అర్హత సాధించడంలో విఫలమయింది. 2014లో క్వార్టర్‌ ఫైనల్స్‌, 2018 వరల్డ్‌కప్‌లో రౌండ్‌ ఆఫ్‌ 16లో వెనుదిరిగిన కొలంబియా ఈసారి మాత్రం మెగాటోర్నీకి అర్హత సాధించలేకపోయింది. దీంతో కొలంబియా జట్టులోని స్టార్‌ ఆటగాళ్లు లుయిస్‌ డియాజ్‌, జేమ్స్‌ రోడ్రిగ్వేజ్‌, డేవిన్‌సన్‌ సాంచెజ్‌లు వరల్డ్‌కప్‌ ఆడే చాన్స్‌ మిస్సయ్యారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top