వీసా తిరస్కరణ.. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌కు భారత రెజ్లర్లు దూరం

21 Indian Wrestlers Miss U-23 World Championship Visa Rejection Spain - Sakshi

స్పెయిన్‌లోని పొంటెవెడ్రాలో జరగనున్న అండర్‌-23 వరల్డ్‌ రెజ్లింగ్‌ చాంపియనషిప్‌కు 21 మంది భారతీయ రెజ్లర్లు దూరమయ్యారు. వీసా గడువు ముగియడంతో స్పెయిన్‌ ఎంబసీ 21 మందికి వీసాలు ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలిసింది. కాగా భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) సోమవారం ప్రారంభమైన ఛాంపియన్‌షిప్ కోసం 30 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసింది. అందులో కేవలం తొమ్మిది మందికి మాత్రమే వీసాలు మంజూరయ్యాయి. చాంపియన్‌షిప్‌కు మిస్‌ అయిన 21 మందిలో అండర్-20 మహిళా ప్రపంచ ఛాంపియన్ యాంటిమ్ పంఘల్  ఉండడం గమనార్హం.

''ఇంతకముందెన్నడూ ఇలా జరగలేదు. భారత ప్రభుత్వ క్లియరెన్స్‌తో పాటు ప్రపంచ పాలక సంస్థ (UWW) నుంచి ఆహ్వానం అందించినప్పటికి మా రెజ్లర్‌లకు వీసాలు నిరాకరించబడ్డాయి. సాధ్యమైనంత త్వరగా పాస్‌పోర్ట్‌లను విడుదల చేయమని అభ్యర్థన చేసిన తర్వాత లేఖలు తిరస్కరణకు గురయ్యాయి. ఇది నిజంగా విచిత్రం.'' అని భారత రెజ్లింగ్‌ సమాఖ్య సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ పీటీఐకి తెలిపారు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top