స్టోర్​లో ప్రవేశించిన పాము.. దీంతో ఆ మహిళ..

Woman Spots Snake Slithering Into Her Store In Viral Video - Sakshi

బ్యాంకాక్​: సాధారణంగా మనలో చాలా మందికి పాములంటే విపరీతమైన భయం. దాని పేరెత్తగానే భయంతో వణికి పోతుంటారు. ఒకవేళ పొరపాటునో, గ్రహపాటునో కనిపిస్తే, ఇంకేమైన ఉందా.. అక్కడి నుంచి చటుక్కున పారిపోతారు. అయితే, ఇలాంటి షాకింగ్​ ఘటన థాయిలాండ్​లోనూ చోటుచేసుకుంది. ఇప్పుడిది సోషల్​ మీడియాలో చక్కర్లు కోడుతుంది. వివరాలు.. చోన్​బూరి​ పరిధిలో ఉన్న ఒక స్టోర్​లో  మహిళ ఉద్యోగి కౌంటర్​లో కూర్చుని ఉంది. ఈ క్రమంలో ఆమె ఏదో వస్తువు​ను రిఫ్రిజిరేటర్​లో పెట్టడానికి వెళ్లింది. అక్కడే, నిలబడి ఫ్రిజ్​లో   చూస్తోంది.

ఇదిలా ఉండగా.. బయట నుంచి ఏదో పాకుకుంటు తన షాప్​లో రావడాన్ని చూసింది. వెంటనే తేరుకుని పరిశీలించి చూసింది. ఒక పాము మెరుపు వేగంతో  షాప్​లోని కౌంటర్​ కింద నుంచి లోపలికి ప్రవేశించింది. దీంతో ఆమెకు ఒక్క సారిగా గుండె ఆగినంతా పనైంది.  దీంతో ఆమహిళ ‘వామ్మో.. అంటూ భయంతో షాపు నుంచి బయటకు పరుగులు తీసింది’. అయితే, ఇదంతా అక్కడే ఉన్న సీసీ ఫుటేజ్​లో రికార్డ్​ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.   దీన్నిచూసిన నెటిజన్లు ‘పాము, మీ షాపులో ఎలుకల కోసం వచ్చుంటుంది..’, ‘ మీ సమయ స్ఫూర్తికి హ్యట్సాఫ్​..’, ‘ మీరు ఒక్కరే ఉన్నారు.. బహుషా.. చూడటానికి వచ్చిందేమో.. ’ అంటూ ఫన్నీగా కామెంట్​లు పెడుతున్నారు.

చదవండి: హెల్మెట్‌​ను చాక్లెట్‌లా మింగేసిన ఏనుగు.. వీడియో వైరల్

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top