వైరల్: వధువు తెగించేసింది భయ్యా! వరుడి నోట్లో నోరు పెట్టి.. | Viral Videos In Social media | Sakshi
Sakshi News home page

వైరల్: వధువు తెగించేసింది భయ్యా! వరుడి నోట్లో నోరు పెట్టి..

Apr 18 2025 12:38 PM | Updated on Apr 18 2025 2:58 PM

Viral Videos In Social media

కర్నూలు (ముచ్చుమర్రి)  సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే వీడియోలు కొన్ని జనాల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంటాయి. అందులో మంచి ఉన్నా.. చెడు ఉన్నా.. సరే తెగ వైరల్‌ అయిపోతుంటాయి. అలా వైరల్‌ అయిన ఓ వీడియో.. అందునా తెలుగు రాష్ట్రానికి చెందిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ వీడియో ఓ యువతి తన భర్తతో అందరి మందే అదర చుంభనం కానిచ్చేసింది. అయితే అది కావాలని చేసింది కాదు. 

నిజానికి వివాహ వేడుకల్లో పెళ్లి తంతులోభాగంగా వధూవరులతో సంప్రదాయబద్ధంగా కొన్ని పనులను పూజారులు దగ్గరుండి చేయిస్తుంటారు. అలాంటివాటిలో వధూవరులు ఒకరి కాలి బొటనవేలు తొక్కడం, బిందెలో ఉంగరం తీయడం, శోభనం గదిలో పూలబంతులాట ఇలాంటి పనులు చేస్తుంటారు. అయితే, ఈ వీడియోలో మాత్రం తన భర్త నోట్లో పెట్టుకున్న స్వీట్‌ను భార్య తీయడం కనిపిస్తుంది. 

ఆ సమయంలో వారి పక్కనే అనేక మంది మహిళలు కూర్చొనివున్నారు. వీరిలో కొందరు వృద్ధులు కూడా ఉన్నారు. అలా కర్నూలు జిల్లాలోని పగిడ్యాల మండలానికి చెందిన గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇన్‌స్టాలో తెగ వైరల్‌ అవుతోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement