చేసిన కర్మకు తక్షణ ప్రతిఫలం.. ఈ వీడియో చూస్తే కాదనలేరు!

A Man Ruthlessly Beating Up A Donkey Then Instant Karma Happened - Sakshi

న్యూఢిల్లీ: మనం చేసిన పనికి ప్రతిఫలం అనుభవించక తప్పదని, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు తిరిగి వస్తుందని పెద్దలు చెబుతుంటారు. చేసిన కర్మకు వెంటనే ప్రతిఫలం వస్తుందంటుంటారు. అందుకు ఈ యువకుడు చేసిన పనే నిదర్శనంగా నిలుస్తోంది. గాడిదను కొడుతూ.. కాళ్లతో తంతూ తీవ్రంగా హింసించిన వీడియో చూస్తే మీరూ అవుననక ఉండలేరు. ఆ యువకుడి వీడియోను శక్తి కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలపై నెటిజన్లు సంతృప్తి చెందారు. కర్మకు తక్షణ ఫలితం ఉంటుందని యువకుడిపై విమర్శలు గుప్పించారు. ఇంతకీ ఏం జరిగిందంటే? 

ఓ యువకుడు గాడిదను తాడుతో కట్టి పట్టుకుని తీవ్రంగా కొట్టాడు. కాళ్లతో తన్నాడు. ఇష్టమొచ్చినట్లు చితకబాదాడు. ఆ తర్వాత దానిపైనే ఎక్కి అక్కడి నుంచి వెళ్లేందుకు యత్నించాడు. యువకుడి దాడితో సహనం కోల్పోయిన గాడిద ఎదురుదాడికి దిగింది. కింద పడేసి ఆ కిరాతకుడి కాలు పట్టుకుని చుట్టూ తిప్పుతూ కాళ్లతో తన్నుతూ దాడి చేసింది. ఈ వీడియోకు రెండు రోజుల్లోనే లక్షకుపైగా వ్యూస్‌ వచ్చాయి. గాడిద ప్రతీకారాన్ని సూచిస్తూ.. కర్మకు ప్రతిఫలం తప్పదంటూ కామెంట్లు చేశారు నెటిజన్లు. ‘రెండోభాగంలో వీడియో సూపర్‌.. సంతృప్తిగా ఉంది’ ‍అని ఓ వ్యక్తి పేర్కొన్నారు. మంచిపని అయింది.. నీకు అదే కావాలి అంటూ మరొకరు రాసుకొచ్చారు.

ఇదీ చదవండి: పావురం బ్యాక్‌ జంప్‌!.. చూస్తే అవాక్కవ్వాల్సిందే: వీడియో వైరల్‌

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top