breaking news
Donkey Vedio
-
Viral Video: చేసిన కర్మకు తక్షణ ప్రతిఫలం అంటే ఇదేనేమో!
న్యూఢిల్లీ: మనం చేసిన పనికి ప్రతిఫలం అనుభవించక తప్పదని, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు తిరిగి వస్తుందని పెద్దలు చెబుతుంటారు. చేసిన కర్మకు వెంటనే ప్రతిఫలం వస్తుందంటుంటారు. అందుకు ఈ యువకుడు చేసిన పనే నిదర్శనంగా నిలుస్తోంది. గాడిదను కొడుతూ.. కాళ్లతో తంతూ తీవ్రంగా హింసించిన వీడియో చూస్తే మీరూ అవుననక ఉండలేరు. ఆ యువకుడి వీడియోను శక్తి కపూర్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలపై నెటిజన్లు సంతృప్తి చెందారు. కర్మకు తక్షణ ఫలితం ఉంటుందని యువకుడిపై విమర్శలు గుప్పించారు. ఇంతకీ ఏం జరిగిందంటే? ఓ యువకుడు గాడిదను తాడుతో కట్టి పట్టుకుని తీవ్రంగా కొట్టాడు. కాళ్లతో తన్నాడు. ఇష్టమొచ్చినట్లు చితకబాదాడు. ఆ తర్వాత దానిపైనే ఎక్కి అక్కడి నుంచి వెళ్లేందుకు యత్నించాడు. యువకుడి దాడితో సహనం కోల్పోయిన గాడిద ఎదురుదాడికి దిగింది. కింద పడేసి ఆ కిరాతకుడి కాలు పట్టుకుని చుట్టూ తిప్పుతూ కాళ్లతో తన్నుతూ దాడి చేసింది. ఈ వీడియోకు రెండు రోజుల్లోనే లక్షకుపైగా వ్యూస్ వచ్చాయి. గాడిద ప్రతీకారాన్ని సూచిస్తూ.. కర్మకు ప్రతిఫలం తప్పదంటూ కామెంట్లు చేశారు నెటిజన్లు. ‘రెండోభాగంలో వీడియో సూపర్.. సంతృప్తిగా ఉంది’ అని ఓ వ్యక్తి పేర్కొన్నారు. మంచిపని అయింది.. నీకు అదే కావాలి అంటూ మరొకరు రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Shakti Kapoor (@shaktikapoor) ఇదీ చదవండి: పావురం బ్యాక్ జంప్!.. చూస్తే అవాక్కవ్వాల్సిందే: వీడియో వైరల్ -
సెహ్వాగ్ పోస్ట్ చేసిన వీడియో చూస్తారా?
-
సెహ్వాగ్ పోస్ట్ చేసిన వీడియో చూస్తారా?
కండ బలం కన్నా బుద్ధి బలం గొప్పదని పెద్దోళ్లు ఎప్పుడో చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే గండాలను తప్పించుకోవచ్చన్నది జగమెరిగిన సత్యం. వీటి గురించి తెలియకపోయినా ఓ గాడిద సమయస్ఫూర్తితో వ్యవహరించి తమకు ‘బుర్ర’ ఉందని నిరూపించింది. గాడిద చాకిరి చేయడమే కాదు చాకచక్యంగా సమస్యల నుంచి బయటపడగలమని వీడియో సాక్షిగా చాటిచెప్పింది. నాలుగు గాడిదలు ఓ దారిలో వెళుతుండగా వాటికి పెద్ద కర్ర అడ్డుగా నిలిచింది. రెండు గాడిదలు కష్టపడి కర్ర పైనుంచి దూకి బయటపడ్డాయి. మూడో గాడిద కర్రపై నుంచి గెంతకుండా ఒక్కసారి ఆలోచించింది. సింపుల్ గా కర్రను నోటితో పట్టుకుని కింద పడేసింది. కష్టపడి గెంతాల్సిన అవసరం లేకుండానే కర్రను దాటి వెళ్లింది. సమయస్ఫూర్తితో దాని వెనుకున్న మరో గాడిదకు కూడా మార్గం సుగమం చేసింది. ఈ ఆసక్తికర వీడియోను టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ట్విటర్ పేజీలో పోస్ట్ చేశాడు.