వైరల్‌ వీడియో.. 60 గుడ్లతో ఆమ్లెట్‌

Giant Omelette Made With 60 Eggs Shocks The Internet - Sakshi

రోజులు గడుస్తున్న కొద్ది భోజనం విషయంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త కొత్త రుచులు జ్విహను లబలబలాడిస్తున్నాయి. తినడంతో పాటు వడ్డించే విధానం కూడా చాలా ఆకర్షణీయంగా మారింది. కేకులు, దోశలు, లడ్డులు వంటి వాటిని భారీ సైజుల్లో తయారు చేసి రికార్డులు సృష్టిస్తున్నారు. తాజాగా ఈ కోవలోకి ఆమ్లెట్‌ చేరింది. 60 గుడ్లతో భారీ ఆమ్లెట్‌ను తయారు చేసి.. ముక్కలుగా కత్తిరించి అందంగా ప్యాక్‌ చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. దీనిలో ఓ కొరియన్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ వెండర్‌ ఓ భారీ ఆమ్లెట్‌ని తయారు చేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి తన దుకాణంలో అమ్మకానికి ఉంచాడు. అతడు ఆమ్లెట్‌ తయారు చేసే విధానం నెటిజనులను తెగ ఆకట్టుకుంటుంది. (చదవండి: ఇంట్లో ప్రయత్నించకండి.. కాలిపోద్ది!)

ఇక వీడియోలో చెఫ్‌ ఓ పెద్ద గిన్నె తీసుకుని.. 60 గుడ్లను పగులకొట్లి దానిలో వేస్తాడు. వాటిని బాగా చిలకొట్టి.. ఉల్లిపాయ, ఉల్లికాడల తరుగు, క్యారెట్‌, మాంసం ముక్కలు కలుపుతాడు. ఆ తర్వాత సరిపడా ఉప్పు, మసలాలు వేసి మరోసారి బాగా గిలక్కొట్టి... ప్యాన్‌పై నూనె వేసి మిశ్రమం మొత్తాన్ని దాని మీద వేస్తాడు. తరువాత దాన్ని చుట్టి పెద్ద ఇటుకలాగా తయారు చేస్తాడు. పూర్తిగా కాలాక దాన్ని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి ప్యాక్‌ చేస్తాడు. దాన్ని కంటైనర్‌లో ఉంచి అమ్మకానికి పెడతాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతుంది. అర్జెంట్‌గా ఆమ్లెట్‌ తినాలినిపిస్తుంది అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు.  

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top