ఫోటో షూట్‌.. మరోరకం ట్రెండింగా..? | Couple Wedding Shoot Viral In Social Media | Sakshi
Sakshi News home page

ఫోటో షూట్‌.. మరోరకం ట్రెండింగా..?

Nov 12 2020 9:03 PM | Updated on Nov 24 2020 4:00 PM

Couple Wedding Shoot Viral In Social Media - Sakshi

ఇప్పుడు పెళ్లిల్లంటే చాలు ఛలో ఫోటో షూట్‌ అంటుంది నేటి యువత. ఒకప్పుడు ఇలాంటి ఆనవాయితీ లేకపోయినా ప్రస్తుత జనరేషన్‌లో, ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన విధంగా వెడ్డింగ్‌ షూట్‌ చేయించుకుంటున్నారు. ఆ చిత్రాలను, వీడియోలను కేవలం వారి వరకే పరిమితం చేసుకోకుండా సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడం అలవాటుగా మారింది. ఈ ఫోటోషూట్‌ కూడా కొన్ని జంటలు రొటీన్‌గా భావిస్తు​న్నాయి. అందుకే విభిన్నవేషధారణల్లో దిగిన అనేక ఫోటోలను దిగుతూ అందరి చూపు వారిపై పడేలా చేసుకుంటున్నారు. ఇలాంటి తరహానే ప్రయత్నించింది ఓ పెళ్లి జంట.

ఎవరో తమపై దాడి జరిపినట్లు కనిపించే విధంగా, ముఖానికి రక్తం అంటినట్లుండే మేకప్‌తో తమ వెడ్డింగ్‌ షూట్‌ చేయించుకున్నారు. వాటిని సోషల్‌ మీడియాలో చూసిన ప్రతి ఒక్కరూ వారికి ఏదో ప్రమాదం జరిగిందనే అనుకునేలా ఉన్నాయి అవి. సరిగ్గా చూస్తేనే కానీ అర్థం కానీ ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు కొందరు మరో రకం ట్రెండ్‌ అని పొగిడితే, మరికొందరు పిచ్చికి పరాకాష్టంటే ఇదేనని కామెంట్‌ చేస్తు​న్నారు. ప్రస్తుతం  ఈ జంట ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక కొన్ని నెలల క్రితం ఒక కేరళ జంట కాస్త విభిన్నంగా ప్రయత్నించిన వెడ్డింగ్‌ షూట్‌ హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement