శనిగరం, తంగళ్లపల్లి విద్యార్థుల జోరు | - | Sakshi
Sakshi News home page

శనిగరం, తంగళ్లపల్లి విద్యార్థుల జోరు

Nov 28 2026 10:29 AM | Updated on Nov 28 2026 10:29 AM

కోహెడరూరల్‌(హుస్నాబాద్‌): సిద్దిపేటలో ఈ నెల 26నుంచి 28 వరకు జరుగుతున్న జిల్లాస్థాయి ఇన్‌స్పైర్‌, వైజ్ఞానిక ప్రదర్శన–2026లో కోహెడ మండలం శనిగరం, తంగళ్లపల్లి ఉన్నత పాఠశాలల విద్యార్థులు అత్యధిక ప్రదర్శనలతో పాల్గొని ఆకట్టుకున్నారు. ఎల్‌నినో ప్రభావం, అగ్నిప్రమాదాల నివారణ, స్మార్ట్‌ లైట్‌వెయిట్‌ వాకర్‌, మానవ హృదయ పనితీరు, అయోనైజేషన్‌ ద్వారా కాలుష్య నివారణ, భారతదేశ నైసర్గిక స్వరూపం వంటి అంశాలపై విద్యార్థులు దీక్షిత, అక్షిత, యశస్విని, హర్షిని, ప్రేమ్‌కుమార్‌, రిజ్వాన్‌, అభిరాం, ప్రసన్న, అనన్య ఎగ్జిబిట్స్‌ ప్రదర్శించి వాటి గురించి వివరించారు. ప్రతిభ కనబరించిన విద్యార్థులను,గైడ్‌ టీచర్లు సరేందర్‌రెడ్డి, యాదమ్మ, శ్రీనివాస్‌, మల్లేశం, శ్రీదేవిలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.సరళ, ఏ.మహేందర్‌రెడ్డి అభినందించారు.

జిల్లాస్థాయి ఇన్‌స్పైర్‌ పోటీల్లో పాల్గొన్న పిల్లలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement