ప్రతీ తండాకు బస్సు సౌకర్యం | - | Sakshi
Sakshi News home page

ప్రతీ తండాకు బస్సు సౌకర్యం

Nov 28 2026 10:29 AM | Updated on Nov 28 2026 10:29 AM

● సర్వసభ్య సమావేశంలో సర్పంచుల వినతి

● వచ్చేనెలలో జీపీలకు క్లియర్‌కానున్న పెండింగ్‌ బిల్లులు

అక్కన్నపేట(హుస్నాబాద్‌): ప్రతీ తండాకు ప్రస్తుతం తారురోడ్లున్నాయని వాటికి ఆర్టీసీ బస్సు సదుపాయం కల్పించాలని పలువురు సర్పంచ్‌లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అక్కన్నపేటలోని రైతు వేదికలో శుక్రవారం మండల ప్రత్యేకాధికారి వీణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి పలువురు సర్పంచ్‌లు హాజరై మాట్లాడారు. సర్పంచులుగా గెలిచి డిసెంబర్‌తో ఏడాది పూర్తవుతుందని, అప్పులు తెచ్చి మరీ గ్రామాల్లో సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేశామని, ఒక్కో జీపీలో రూ.20 లక్షల నుంచి రూ.30లక్షల వరకు ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పథకంలో పని చేసి అప్పుల్లో మునిగిపోయామని ప్రభుత్వం వెంటనే పెండింగ్‌ బిల్లులను క్లియర్‌ చేయాలని వారు కోరారు. అయితే ఉపాధిహామీ ఏపీఓ ప్రభాకర్‌ ఇందుకు స్పందిస్తూ డిసెంబర్‌ మూడోవ వారంలోగా పెండింగ్‌ బిల్లులన్నీ క్లియర్‌ చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్‌ చెప్పారని వివరించారు. జనగామ, గుబ్బడి గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని సర్పంచ్‌లు కోరారు. ఎవరైనా ఫీల్డ్‌ అసిస్టెంట్లు సర్పంచులకు వినకపోతే తీర్మానం చేసి తొలగించే అవకాశం సర్పంచులకు ఉందన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ మధుసూదన్‌, ఎంఈవో గుగులోతు రంగానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement