జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురువులను చులకన చేసి మాట్లాడటం సరికాదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, టీపీసీసీ సభ్యుడు దరిపల్లి చంద్రం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే హరీశ్‌రావు అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫాంలు, షూస్ ఇవ్వడం లేదని, మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని హరీశ్‌రావు వ్యాఖ్యానించడం వాస్తవాలను వక్రీకరించడమేనన్నారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పక్కనపెట్టి, లేనిపోని ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
27 ఎస్‌డీపీ 131–జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం


