అసలే వర్షాభావ పరిస్థితులతో ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో నీటి కష్టాలు వస్తాయని, నీటి పొదుపు చేయాలని అధికారులు ఓ వైపు ప్రచారం చేస్తున్నప్పటికీ దాని అమలు మాత్రం ప్రకటనలకే పరిమితమైపోతోంది. అందుకు ఇదిగో ఈ ఫొటోనే నిదర్శనం. సిద్దిపేట రైల్వే సమీపంలో మిషన్‌భగీరథ పైపు నుంచి నిత్యం వందలాది మీటర్ల నీరు వృథాగా పోతోంది. వృథాను అరికడుతూ ఆ నీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
–సాక్షి,స్టాఫ్‌ఫొటోగ్రాఫర్,సిద్దిపేట


