రీ సర్వేతో శాశ్వత పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

రీ సర్వేతో శాశ్వత పరిష్కారం

Nov 28 2026 10:29 AM | Updated on Nov 28 2026 10:29 AM

● కలెక్టర్‌ హైమావతి

● సింగాయపల్లిలో సర్వే ప్రక్రియ పరిశీలన

గజ్వేల్‌/వర్గల్‌(గజ్వేల్‌): భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ భారతి రీ సర్వే ప్రక్రియ నిర్వహిస్తోందని కలెక్టర్‌ కె.హైమావతి పేర్కొన్నారు. శుక్రవారం వర్గల్‌ మండలం సింగాయపల్లి, గజ్వేల్‌ మండలం కోమటిబండలో భూ భారతి రీ సర్వే కార్యక్రమాన్ని కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గ్రామంలో సర్వే నిర్వహణకు రెండు రోజుల ముందుగానే రైతులకు సమాచారం అందించి సర్వే సమయంలో భూమి వద్దకు వచ్చేవిధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. లక్ష్యం ప్రకారం సర్వే పూర్తిచేయాలని భూమి సర్వే చేశాక సందేహాలుంటే ఆయా రైతులు వెంటనే అధికారులకు తెలిపి మళ్లీ వెరిఫికేషన్‌ చేయించుకోవాలని స్పష్టం చేశారు. ముందుగా అటవీ, ఇరిగేషన్‌, రైల్వే ఇతర శాఖల భూములను సర్వేచేశాక, పట్టా భూముల సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో నేపథ్యంలో యాసంగిలో వరి కాకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. కలెక్టర్‌ వెంట తహశీల్దార్‌ శ్రీకాంత్‌ గజ్వేల్‌ తహశీల్దార్‌ శ్రీనివాస్‌, సర్వేయర్లు తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement