నేటి మహా పాదయాత్ర తాత్కాలిక వాయిదా | - | Sakshi
Sakshi News home page

నేటి మహా పాదయాత్ర తాత్కాలిక వాయిదా

Nov 25 2026 11:05 AM | Updated on Nov 25 2026 11:05 AM

విద్యాధరి సేవలో ఇందిరా చతుర్వేది వివక్ష లేని సమాజమే లక్ష్యం కావాలి న్యాయవాదుల పాత్ర గొప్పది

ప్రశాంత్‌ నగర్‌ (సిద్దిపేట): జిల్లా కేంద్రంలో బుధవారం జరగనున్న మహా పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్‌ ముదిరాజ్‌ ప్రకటనలో పేర్కొన్నారు. మహా పాదయాత్రలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొనాల్సి ఉందని, అయితే కేంద్ర కేబినెట్‌ అత్యవసర సమావేశాల్లో కేంద్రమంత్రి పాల్గొనాల్సి ఉన్నందున పాదయాత్రకు రాలేకపోతున్నారని, అందుకే తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. తిరిగి త్వరలోనే మళ్లీ పాదయాత్ర తేదీని ప్రకటిస్తామన్నారు.

వర్గల్‌(గజ్వేల్‌): కార్తీకపౌర్ణమి వేళ మంగళవారం వర్గల్‌ విద్యాసరస్వతి క్షేత్రాన్ని రాజ్యసభ సెక్రటేరియట్‌ డైరెక్టర్‌ ఇందిరా చతుర్వేది వైద్య సందర్శించారు. ఆలయ పరివారం ఆమెకు సాదర స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని అర్చన జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మహదాశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. శేషవస్త్రంతో సన్మానం చేశారు. క్షేత్రం బాగుందని అన్నారు. ఆమె వెంట మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌ ఉన్నారు.

సిద్దిపేటకమాన్‌: వివక్ష లేని సమాజమే లక్ష్యం కావాలని, ఇందుకు వామపక్ష, ప్రజాస్వామిక శక్తులు కృషి చేయాలని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్‌ పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ, ఆకలిలేని సమాజ నిర్మాణం వివక్ష లేని సమాజ స్థాపన కోసం ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలన్నారు. యుద్ధాల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఆయుధాల తయారీ, యుద్ధాల కోసం వెచ్చిస్తున్న అపారమైన సంపదను ప్రజల సంక్షేమం, విద్య, వైద్యం, ఉపాధి, అభివృద్ధి కోసం వినియోగించాలని ఆకాంక్షించారు. అనంతరం ఏఐపీఎస్‌ఓ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు మంద పవన్‌, మల్లారెడ్డి, వివిధ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బీమా నిరుపేదలకు ధీమా

నంగునూరు(సిద్దిపేట): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నిరుపేదలకు ధీమా ఇస్తుందని ఏఎంసీ చైర్మన్‌ దేవులపల్లి యాదగిరి అన్నారు. నంగునూరు, రాంపూర్‌, బద్దిపడగ, సిద్దన్నపేట, నాగరాజుపల్లి గ్రామాల్లో మంగళవారం బీమా నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంబించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రయోజనం కలిగేలా పథకాన్ని రుపొందించారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్‌ సర్పంచ్‌లు బాలపోచయ్య, పురేందర్‌, లక్ష్మి, మహిపాల్‌రెడ్డి, లింగం, నితీష్‌కుమార్‌, యాదగిరి, కృష్ణ, శ్రీనివాస్‌, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

తూప్రాన్‌: న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల కన్నా న్యాయవాదుల పాత్రే ఎంతో గొప్పదని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్‌ సివిల్‌ జడ్జి కం ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టును హైకో ర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్‌ సుద్దాల చలపతిరావు ప్రారంభించారు. హైకోర్టు న్యాయమూర్తులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పా టు చేసిన సభలో జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ ఒక ‘ల్యాండ్‌ ఆఫ్‌ సెలబ్రేషన్స్‌’అని, జీవితంలో ప్రతీరోజూ ఒక వేడుకలా భావిస్తూనే అందుకు తగ్గట్టుగా కష్టపడి పనిచేయాలని సూచించారు. యువ న్యాయవాదులు పబ్లిసిటీపై కాకుండా వృత్తిపై ఆదరణ పెంచుకోవాలని, లాయర్‌ యొక్క మంచితనమే వారికి అసలైన పబ్లిసిటీ అని హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement