ఇంటర్‌కూ పీఈఎన్‌ | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌కూ పీఈఎన్‌

Nov 25 2026 11:05 AM | Updated on Nov 25 2026 11:05 AM

సిద్దిపేట ఎడ్యుకేషన్‌: పదో తరగతిలాగే ఇక మీదట ఇంటర్మీడియేట్‌ సర్టిఫికెట్‌లపై పర్మినెంట్‌ ఎడ్యుకేషన్‌్‌ నంబర్‌ (పెన్‌)ను ముద్రించనున్నారు. తద్వారా సదరు విద్యార్థి ఉన్నతవిద్యను కొనసాగిస్తున్నారా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు. దీంతో డ్రాపౌట్స్‌ను పసిగట్టొచ్చు. వచ్చే మార్చిలో ఇంటర్‌ పరీక్షలు రాసే విద్యార్థుల సర్టిఫికెట్లపై 11 అంకెల పెన్‌ నంబర్‌ ముద్రిస్తారు. ఈ సర్టిఫికెట్‌లను డిజి లాకర్‌లో భద్రపర్చుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా 11వేల విద్యార్థులుండగా అందులో 20 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 6,500 మంది విద్యార్థులు చదువుతున్నారు.

పెన్‌తో విద్యార్థి వివరాలు ట్రాక్‌

ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీస్థాయికి వెళ్లే సరికి సుమారు 40% మంది విద్యార్థులు డ్రాపౌట్స్‌ అవుతున్నారని అధికారిక లెక్కలు సూచిస్తున్నాయి. అయితే వారు ఏ స్థాయిలో చదువు మానేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్నారా? అనే విషయాలు తెలుసుకోవడానికి విద్యాశాఖ ట్రాకింగ్‌ సిస్టం అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం యూడైజ్‌ పోర్టల్‌ ద్వారా ప్రతీ విద్యార్థికి ఈ పర్మినెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబర్‌ ఇస్తున్నారు. 2024 నుంచి పదో తరగతి సర్టిఫికెట్లపై ఈ పెన్‌ను ముద్రిస్తున్నారు. దాన్ని సమగ్ర శిక్ష నుంచి ఇంటర్‌బోర్డు తీసుకుంటుంది. కానీ, సర్టిఫికెట్‌లపై ముద్రించడం లేదు.

డిజిలాకర్‌లో సర్టిఫికెట్లు భద్రం

ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, ప్రయాణాలు చేసేటప్పుడు ఒకోసారి సర్టిఫికెట్లు పోగొట్టుకున్న సందర్భంలో, వాటిని తిరిగి పొందడానికి ఆయా ధ్రువపత్రాలను డిజి లాకర్‌లో భద్రపర్చుకునే అవకాశం ఉంది. అందుకే అపార్‌ పేరిట విద్యార్థులకు 12 అంకెల గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. సొంతగానే దాన్ని అపార్‌ పోర్టల్‌ ద్వారా పొందొచ్చు. దీనికి తప్పనిసరిగా ఆధార్‌ నంబర్‌ ఉండాలి. విద్యా సంస్థల ద్వారా పొందాలంటే ఆధార్‌ సంఖ్య ఇవ్వడమే గాకుండా, తల్లిదండ్రుల అంగీకారం అవసరం. అపార్‌ ఐడీ ఉంటేనే, తమ సర్టిఫికెట్లను డిజిలాకర్‌లో భద్రపర్చుకునే అవకాశం ఉంటుంది.

పదోతరగతి లాగే 11 అంకెల పర్మినెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబర్‌

ఇక డ్రాపౌట్స్‌కూ చెక్‌ పెట్టే అవకాశం

డిజిటల్‌ లాకర్‌లో సర్టిఫికెట్లు భద్రం

జిల్లాలో 11వేల మంది ఇంటర్‌ విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement