గజ్వేల్: సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజల్లో చైతన్యం పెంపొందించాలని సిద్దిపేట సీసీ రష్మీపెరుమాళ్ సూచించారు. మంగళవారం జగదేవ్‌పూర్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణ, రికార్డుల నిర్వహణ తీరు పరిశీలించి పోలీస్‌స్టేషన్‌లో పెండింగ్ కేసుల వివరాలను తెలుసుకున్నారు. స్టేషన్‌కు న్యాయం కోసం వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో సిబ్బంది మర్యాదగా, బాధ్యతాయుతంగా మెలగాలని ఆదేశించారు. అత్యవసర సమయాల్లో 112కు కాల్ వస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా, సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు అండగా నిలవాలన్నారు. నేరాల నియంత్రణ, గ్రామాల భద్రత కోసం ‘సిద్దిపేట సురక్ష నేత్ర’ కార్యక్రమం కింద ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలన్నారు. కాగా కార్తీక పౌర్ణమి సందర్భంగా మండల పరిధిలోని జంగంరెడ్డిపల్లిలోగల సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించి దర్శనం చేసుకున్నారు. కార్యక్రమంలో గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు, ఎస్‌ఐ క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.
అవగాహన పెంపొందించాలి
సీపీ రష్మీ పెరుమాళ్
జగదేవ్‌పూర్ పోలీస్‌స్టేషన్ తనిఖీ


