కాంగ్రెస్‌, బీజేపీల తీరును ఎండగడతాం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌, బీజేపీల తీరును ఎండగడతాం

Nov 25 2026 11:05 AM | Updated on Nov 25 2026 11:05 AM

గజ్వేల్‌: కాంగ్రెస్‌ పాలనలో విసిగిపోయిన ప్రజలు తిరిగి కేసీఆర్‌ పాలన కోరుకుంటున్నారని, ఈ క్రమంలోనే అధికార పార్టీ ఉనికి కోసం ఆరాటపడుతున్నదని అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్‌ విధానాలపై ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తుంగలో తొక్కారని చెప్పారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తుండగా, ఏ ఒక్క భారీ అభివృద్ధి ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రజలకు అందించలేపోయారని తెలిపారు. ఈ క్రమంలో బహిరంగ సభల పేరుతో ప్రజల్లో ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. బీజేపీ సైతం అదే బాటలో పయనిస్తున్నదని ఆరోపించారు. పాదయాత్రల పేరుతో హల్‌చల్‌ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు దొందుదొందేనని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది కేవలం బీఆర్‌ఎస్‌ మాత్రమేనన్నారు. సమావేశంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దేవీ రవీందర్‌, బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్‌మీరా, కొండపాక మండల పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement