గజ్వేల్: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసి, శాసీ్త్రయ దృక్పథాన్ని వెలికితీయడానికి చెకుముకి పోటీలు దోహదపడతాయని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. మంగళవారం చెకుముకి సైన్స్ సంబరాలు–2026కు సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో ఆలోచనాశక్తిని పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు అవసరమన్నారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మ సత్యం మాట్లాడుతూ ఈనెల 12న పాఠశాల స్థాయిలో, 21న మండల స్థాయిలో, 28న జిల్లా కేంద్రాల్లో, డిసెంబర్ 11, 12, 13 తేదీల్లో సీఎంఆర్ కళాశాల మేడ్చల్లో రాష్ట్రస్థాయి పోటీలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో జిల్లా చెకుముకి పోటీల కన్వీనర్ శ్రీనివాస్, జన విజ్ఞాన వేదిక జిల్లా కోశాధికారి పోశయ్య, సభ్యులు నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


