దేవుడి చిత్రం.. వీడ్కోలు విచిత్రం | - | Sakshi
Sakshi News home page

దేవుడి చిత్రం.. వీడ్కోలు విచిత్రం

Nov 11 2026 9:28 AM | Updated on Nov 11 2026 9:28 AM

చెట్ల దగ్గర పెట్టేవాళ్లం...

ఇంట్లో పూజించే దేవుడి చిత్రపటాలు పాడైతే వాటిని తొలగించి కొత్తవి తీసుకువచ్చి పూజిస్తాం. ఈ పాత ఫొటోలను దేవాలయ ప్రాంగణంలోని చెట్టు మొదళ్ల వద్ద పెట్టే వాళ్లం. దేవుడి పాత చిత్రపటాలను సేకరించి వాటికి శాస్రోక్తంగా ఉద్వాసన కార్యక్రమం నిర్వహించడం సంతోషదాయకం.

– సోమ గీతాంజలి, సిద్దిపేట

పర్యావరణాన్ని కాపాడేందుకే...

పగిలిన, చిరిగిన దేవుడి చిత్రపటాలను తీసివేసి కొత్త వాటితో పూజలు చేస్తుంటారు. పాతవాటిని చెరువులు, చెత్తకుప్పలలో పడేస్తుంటారు. గాజు, చెక్క ప్రేమ్‌లను చెరువులలో పడేయడంతో పర్యావరణానికి నష్టం కలుగుతుంది. పర్యావరణాన్ని, సనాత ధర్మాన్ని కాపాడేందుకు వినియోగంలో లేని దేవుడి చిత్రపటాలకు ఉద్వాసన పూజ కార్యక్రమంను నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించడం ఇది రెండో సారి. గతంలో నిర్వహించినప్పుడు మంచి స్పందన వచ్చింది. హైదరాబాద్‌ నుంచి సైతం పార్సల్‌లో పంపిస్తున్నారు.

– దీప్తి, నాగరాజు, నిర్వాహకులు

సాక్షి, సిద్దిపేట: ఇంట్లో దేవుడి ఫొటో పెట్టి నిత్యం పూజలు చేస్తాం. పండుగలు, పర్వదినాల్లో ప్రత్యేక అలంకరణలు చేస్తాం. భక్తిశ్రద్ధలతో కొలుస్తాం. కానీ అదే దేవతామూర్తి చిత్రపటం పాతబడితే పరిస్థితి మారిపోతోంది. చిరిగిపోయిన, రంగులు వెలిసిన పటాలు, పగిలిన ఫ్రేములు చివరకు చెరువులు, కాలువల్లో పాడేస్తుంటారు. భక్తితో కొలిచిన దైవ స్వరూపాలకు ఈ దుస్థితి ఎందుకన్న ఆలోచన నుంచి ఓ మంచి ప్రయత్నం మొదలైంది. పూజించిన దేవతామూర్తుల చిత్రాలను గౌరవంగా ఉద్వాసన చెప్పేందుకే సిద్దిపేటలో దీప్తి నాగరాజు దంపతులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ప్రకృతి పరిరక్షణ

దేవతామూర్తుల చిత్రపటాలు పాతబడగానే వాటిని ఏం చేయాలో చాలామందికి తెలియదు. కొందరు ఇంట్లోనే భద్రపరుస్తుంటే.. మరికొందరు చెరువులు, కాలువల్లో వదిలేస్తున్నారు. అలా వదిలేసిన చిత్రపటాలు, వాటికి సంబంధించిన ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలు జలవనరుల్లో కలుస్తున్నాయి. ఒకవైపు భక్తుల మనోభావాలు దెబ్బతింటుండగా.. మరోవైపు పర్యావరణానికి నష్టం వాటిల్లుతోంది. ఈ రెండు సమస్యలకు పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో పాత చిత్రపటాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. దైవ చిత్రపటాలకు గౌరవం ఇవ్వడంతోపాటు ప్రకృతిని కాపాడే బాధ్యతను కూడా ప్రతి ఒక్కరిలో పెరగనుంది.

చిత్ర పటాలను సేకరించి..

పాత దేవతామూర్తుల చిత్రాలను ఒకచోటకు చేర్చి సంప్రదాయబద్ధంగా ఉద్వాసన చేయాలన్నది నిర్వాహకుల సంకల్పం. ఈ నెల 4 నుంచి చిత్రపటాలను సేకరిస్తున్నారు. సిద్దిపేట పట్టణంలో స్వచ్ఛబడిలో ఈ నెల 11న సేకరించిన చిత్రాలకు ప్రత్యేకంగా వేద మంత్రాలతో ఉద్వాసన కార్యక్రమం నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వందల సంఖ్యలో దేవుడి చిత్ర పటాలను తీసుకవచ్చి నిర్వహకులకు అందిస్తున్నారు. పూజ అనంతరం గాజు, ఫొటో ప్రేమ్‌, కాగితాలు వేరు చేసి వాటిని రిసైక్లింగ్‌కు పంపించనున్నారు.

భక్తితో కొలిచిన పాత చిత్రాలకు సంప్రదాయబద్ధంగా ఉద్వాసన

పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమం

నేడు సిద్దిపేటలో ప్రత్యేక పూజలతో ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement