సిద్దిపేట నుంచే ఇందిరమ్మ బీమా | - | Sakshi
Sakshi News home page

సిద్దిపేట నుంచే ఇందిరమ్మ బీమా

Nov 11 2026 9:28 AM | Updated on Nov 11 2026 9:28 AM

సిద్దిపేటజోన్‌: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చారిత్రాత్మక ఇందిరమ్మ బీమా పథకానికి సిద్దిపేట నుంచే అడుగుల వేయనుందని, ఈనెల19న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పథకాన్ని ప్రారంభించనున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్‌ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నియోజకవర్గ పరిధిలోని 1,121మంది లబ్ధిదారులకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పథకం ద్వారా రాష్ట్రంలో కోటి మందికి రూ. 5లక్షల చొప్పున బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, మహిళలకు ఉచిత ప్రయాణం ప్రజల్లో ఎంతో ఆదరణ పొందినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా 5,500 ఇళ్లు మంజూరు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు లక్షల ఇళ్లు త్వరలో మంజూరు చేయనున్నామన్నారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రజలకు తాగునీరు ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. అమృత్‌ పథకం ద్వారా సిద్దిపేటలో ఇంటింటికీ తాగునీరు వస్తుందన్నారు. అంతకుముందు కలెక్టర్‌ హైమావతి మాట్లాడుతూ... పేద ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పద్మశాలీ కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రం, నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి హరికృష్ణ, ఆత్మ కమిటీ చైర్మన్‌ గోపి, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు

19న పథకాన్ని ప్రారంభించనున్న సీఎం

కోటి మందికి రూ.5లక్షల చొప్పున సాయం

మరో రెండు లక్షల ఇందిరమ్మ ఇళ్లు

కార్మిక శాఖ మంత్రి వివేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement