అసత్యాలను తిప్పికొడదాం | - | Sakshi
Sakshi News home page

అసత్యాలను తిప్పికొడదాం

Nov 11 2026 9:28 AM | Updated on Nov 11 2026 9:28 AM

హుస్నాబాద్‌: అసత్యాలను తప్పికొడుతూ క్షేత్రస్థాయిలో వచ్చిన మార్పులను, చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మంగళవారం పట్టణంలోని తిరుమల గార్డెన్స్‌లో హుస్నాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్య రంగంలో స్పెషలైజేషన్‌ ప్రాధాన్యత పెరిగినట్లే రాజకీయాలలో సోషల్‌ మీడియా కళ్లు, చెవులుగా మారి అత్యంత కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అన్ని గ్రామాల్లో తాగునీటి ఫిల్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. కబడ్డీ అకాడమీ, స్విమ్మింగ్‌ ఫూల్‌ నిర్మాణంతో పాటు కళలు, నృత్యాలు వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు.

కొత్తగా 5,230 పెన్షన్లు

హుస్నాబాద్‌ నియోజకవర్గంలో కొత్తగా 5,230 పెన్షన్లు ప్రభుత్వం మంజూరు చేసిందని విలేకరుల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. ఏడు రకాల పెన్షన్లకు సంబంధించి 6,313 దరఖాస్తులు రాగా, క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం 5,230 పెన్షన్లు మంజూరయ్యాయన్నారు.

త్వరలో ఉప ముఖ్యమంత్రి రాక..

హుస్నాబాద్‌లోని అభివృద్ధి కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క త్వరలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని మంత్రి తెలిపారు. కార్యక్రమాల్లో టీపీసీసీ సోషల్‌ మీడియా చైర్మన్‌ నవీన్‌, వైస్‌ చైర్మన్‌ అనురాగ్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దండి లక్ష్మి, వైస్‌ చైర్‌ పర్సన్‌ చిత్తారి పద్మ, సింగిల్‌ విండో చైర్మన్‌ శివయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ తిరుపతి రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ కేడం లింగమూర్తి, ఏడు మండలాల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సోషల్‌ మీడియా వారియర్లు పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్‌ కార్యకర్తలు

మాట్లాడుతున్న మంత్రి పొన్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement