ములుగు ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ రాజిరెడ్డి
ములుగు(గజ్వేల్): ఎల్నినో నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవా లని ములుగు ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ రాజిరెడ్డి సూచించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నీటి లభ్యత మేరకు పంటల సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని, తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపా రు. ప్రతి నీటిబొట్టును సమర్థవంతంగా వినియోగించుకుంటూ నీటి సంరక్షణ చేపట్టాలన్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు చేస్తే పంట నష్టాలను తగ్గించుకోవచ్చన్నారు. అలాగే మెరుగైన ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.


