బాలల రక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

బాలల రక్షణ అందరి బాధ్యత

Oct 30 2026 7:30 AM | Updated on Oct 30 2026 7:30 AM

చిన్నకోడూరు(సిద్దిపేట): బాలబాలికల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, వారిపై లైంగిక నేరాలు జరగకుండా సమాజంలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. గురువారం మండల పరిధిలోని గోనెపల్లి ఉన్నత పాఠశాల, ఇబ్రహీంనగర్‌ మోడల్‌ స్కూల్‌లో సురక్షిత్‌ బచ్‌పన్‌ అభియాన్‌ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు బాలల హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎవరైనా అనుచితంగా వ్యవహరిస్తే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయు లకు చెప్పాలన్నారు. కార్యక్రమంలో మోడల్‌ స్కూల్‌ హెచ్‌ఎం సతీశ్‌కుమార్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలి

సీపీ రష్మీపెరుమాళ్‌

గజ్వేల్‌: విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకుసాగాలని సీపీ రష్మీపెరుమాళ్‌ అన్నారు. గురువారం గజ్వేల్‌లోని మహతి ఆడిటోరియంలో ‘షీ టీమ్‌’ అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెడు అలవాట్లకు దూరంగా ఉండి, నైపుణ్యాలను పెంపొందించుకోవడంపైనే దృష్టి పెట్టాలన్నారు. విద్యార్థుల్లో నేరప్రవృత్తిని నివారించడం, రహదారి భద్రత, సైబర్‌ నేరాల నివారణ, మాదకద్రవ్యా ల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన పెంచడానికే సదస్సులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మైనర్లు వాహనాలు నడపటం నేరమని చెప్పా రు. ఆన్‌లైన్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సదస్సులో ఏసీసీ నర్సింహులు, సీఐ రవికుమార్‌, గౌరారం సీఐ రవిరాజు, ఇన్‌స్పెక్టర్‌ లతీఫ్‌, మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ దుర్గ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

సిద్దిపేటజోన్‌: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు పరమేశ్వర్‌, ప్రధాన కార్యదర్శి విక్రమ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఉద్యోగులకు 40 శాతం వేతన స్థిరీకరణ ఫిట్మెంట్‌ ప్రకటించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు నెట్‌వర్క్‌ ఆస్పత్రులలో ఆరోగ్య బీమా పథకం అమలు చేయాలన్నారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని, జిల్లాలో ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. సిద్దిపేట జిల్లాను చార్మినార్‌ జోన్‌ పరిధిలో కలపాలని, జీఓ 190 అమలు చేస్తూ 317జీఓ ఉద్యోగులకు న్యాయం చేయాలని, తదితర అంశాలపై కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశా రు. కార్యక్రమంలో ఆయా యూనిట్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

బాల సదనాన్ని

సందర్శించిన ఢిల్లీ బృందం

సిద్దిపేటజోన్‌: భారత మహిళా శిశు సంక్షేమ శాఖ న్యూఢిల్లీకి చెందిన బృందం జిల్లా కేంద్రంలోని బాలసదనాన్ని సందర్శించింది. సెంట్రల్‌ అడప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ(సీఏఆర్‌ఏ) ప్రతినిధి దివ్య మిరియం పాల్‌ ఆధ్వర్యంలో అధికారులు పిల్లలకు అందిస్తున్న వసతి, భోజనం విద్య, ఆరోగ్య పరిరక్షణ, తదితర సదుపాయాల గూర్చి అరా తీశారు. దత్తత ప్రక్రియ వివరాలు అమలు తీరు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర కో ఆర్డినేటర్‌ సునీత, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారి రాము, సిబ్బంది రాజారాం, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement