అట్టహాసంగా ఎస్‌జీఎఫ్‌ క్రీడలు షురూ.. | - | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా ఎస్‌జీఎఫ్‌ క్రీడలు షురూ..

Oct 30 2026 7:30 AM | Updated on Oct 30 2026 7:30 AM

సిద్దిపేటరూరల్‌: పీఎంశ్రీ పాఠశాలల జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ క్రీడలను చిన్నగుండవెల్లి శివారు ఎల్లంకి కళాశాల మైదానంలో అట్టహాసంగా గురువారం ప్రారంభమయాయ్యి. ఈ క్రీడలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. ఎస్‌జీఎఫ్‌ సెక్రటరి భాస్కర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు క్రీడలను ప్రారంభించారు. అండర్‌ 17 విభాగంలో బాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, అథ్లెటిక్స్‌ క్రీడా పోటీలను నిర్వహించారు. కబడ్డీ పోటీల్లో ప్రథమస్థానం జెడ్పీహెచ్‌ఎస్‌ కుకునూర్‌పల్లి, ద్వితీయస్థానంలో జెడ్పీహెచ్‌ఎస్‌ సింగన్నగూడ, తృతీయస్థానంలో సోషల్‌వెల్ఫేర్‌ రామక్కపేట నిలిచాయి. అలాగే ఖోఖో పోటీల్లో జెడ్పీహెచ్‌ఎస్‌ రాయపోల్‌ ప్రథమస్థానం, బాలికల ఉన్నత పాఠశాల సిద్దిపేట ద్వితీయస్థానం, వాలీబాల్‌ క్రీడల్లో జెడ్పీహెచ్‌ఎస్‌ కుకునూర్‌పల్లి ప్రథమస్థానం, జెడ్పీహెచ్‌ఎస్‌ రాయపోల్‌ ద్వితీయస్థానం, మోడల్‌స్కూల్‌ అక్కెనపల్లి తృతీయస్థానం సాధించాయి. జిల్లా వ్యాప్తంగా 27 పీఎంశ్రీ పాఠశాలల క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన జట్లకు బహుమతులను ప్రధానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement