దుబ్బాకరూరల్: మండలంలోని కమ్మర్‌పల్లి గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహించకూడదని, మద్యపానం నిషేధించాలని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. సర్పంచ్ సుజాత మాట్లాడుతూ గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహించడం వల్ల కొంతమంది మద్యానికి బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. వచ్చిన కూలీ డబ్బును మద్యానికి ఖర్చు చేయడంతో కుటుంబాలను పోషించలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులు నిర్వహించి మద్యం అమ్మితే రూ.లక్ష జరిమాన విధిస్తామని హెచ్చరించారు. మ్యదం విక్రయించినట్లు సమాచారం ఇచ్చిన వారికి రూ.10వేలు పారితోషికం అందజేస్తామని తెలిపారు.


