శోభాయాత్రలో ఉత్సాహంగా భక్తులు..
జిల్లా వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా ముగిసింది. 11 రోజుల పాటు విశేష పూజలందుకున్న ఏకదంతుడికి బై బై అంటూ గంగమ్మ ఒడికి చేర్చారు. మేళతాళాలు, డప్పు చప్పుళ్లు, యువత కేరింతలు, గణపతి బప్పా మోరియా అంటూ నినాదాల హోరు నడుమ ప్రత్యేక వాహనాలపై గణనాథులను ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. నిమజ్జనం వైపు తరలివెళ్లే వినాయక విగ్రహాలకు ఘన వీడ్కోలు పలుకుతూ అడుగడుగునా స్వాగత వేదికలను ఏర్పాటుచేశారు. శోభాయాత్రలు, స్వాగత వేదికల వద్దకు పలువురు రాజకీయ ప్రముఖులు విచ్చేసి గణనాథులను దర్శించుకున్నారు. – ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)
పల్లకీలో
గణపయ్య..


