బతుకమ్మ ఆడుతూ నిరసన | - | Sakshi
Sakshi News home page

బతుకమ్మ ఆడుతూ నిరసన

Sep 4 2026 7:29 AM | Updated on Sep 4 2026 7:29 AM

నంగునూరు(సిద్దిపేట): పాలిటెక్నిక్‌ కళాశాలలపై ప్రభుత్వ ఇచ్చిన జీఓ 97ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాజగోపాల్‌పేటలో అధ్యాపకుల నిరసన 16వ రోజుకు చేరుకుంది. టీపీ జేఏసీ పిలుపు మేరకు మంగళవారం మహిళా అధ్యాపకులు బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐక్య కార్యాచరణ సమితి సహ అధ్యక్షుడు అభినవ్‌ మాట్లాడుతూ పాలిటెక్నిక్‌ కళాశాలలను శక్తిలో విలీనం చేస్తే పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతారన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

యూరియా కోసం

రైతుల నిరసన

దుబ్బాక: యూరియా కోసం రైతులు మంగళవారం దుబ్బాకలో ఆందోళనకు దిగారు. యాప్‌తో యూరియా బుక్‌ కావడం లేదని, ఎప్పుడు ఏ షాప్‌నకు యూరియా వస్తదో తెలి యని అయోమయ పరిస్థితులు ఏర్పడటంతో తమ పంటలు దెబ్బతింటున్నాయని వాపోయా రు. ఈ మేరకు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు రాజిరెడ్డి, మహేశ్‌ మాట్లాడుతూ కొత్తగా తీసుకొచ్చిన యాప్‌తో రైతులు చాల ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. సరిపడా యూరియాను అందుబాటులో ఉంచి యాప్‌తో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్య క్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.

పర్యాటక కేంద్రంగా

ఎల్లమ్మ చెరువు

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దండి లక్ష్మి

హుస్నాబాద్‌: కాకతీయుల కాలంలో నిర్మించిన ఎల్లమ్మ చెరువును సుందరీకరణ పనులతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దండి లక్ష్మి అన్నారు. మంగళవారం పట్టణంలో కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అనంతరం ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు. లక్ష్మి మాట్లాడుతూ రూ.18 కోట్ల వ్యయంతో చెరువు సుందరీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయని, అదనంగా టీయూఎఫ్‌ఐడీసీ కింద రూ.3 కోట్లు మంజూరు చేయించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా చెరువు మధ్యలో నిర్మిస్తున్న గ్లాస్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. చెరువు కట్ట పైన, కట్ట కింది భాగంలో గ్రీనరీ, వివిధ రకాల ఆకృతులతో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ చిత్తారి పద్మ, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు వడ్డెపల్లి వెంకట రమణ, కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు.

నిర్దిష్టమైన లక్ష్యంతోనే ఉన్నతస్థాయికి

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): ప్రతి ఒక్కరూ నిర్ధిష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని, జిల్లా ఉపాఽధి కల్పన అధికారి డాక్టర్‌ ప్రియాంక, స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ కృష్ణ దయాసాగర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్‌ లో 125 రోజుల ఫౌండేషన్‌ కోర్స్‌ ఉచిత శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమశిక్షణతో ప్రతిరోజూ చదువుతూ పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ప్రతి అవకాశా న్ని సద్వినియోగం చేసుకొని తమ నైపుణ్యాల ను పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ 125 రోజుల శిక్షణ విద్యార్థుల జీవితంలో ఒక గొప్ప అవకాశమని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement