హామీల అమలులో సర్కార్‌ విఫలం | - | Sakshi
Sakshi News home page

హామీల అమలులో సర్కార్‌ విఫలం

Sep 4 2026 7:29 AM | Updated on Sep 4 2026 7:29 AM

ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు

ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు

గజ్వేల్‌: హామీల అమలులో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం గజ్వేల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం తీరుపై మండిపడ్డారు. వెయ్యి రోజుల పాలనలో రేవంత్‌రెడ్డి అన్ని రంగాల్లో వైఫల్యాన్ని చాటుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పాలనను ఎండగట్టే క్రమంలో వారం రోజులపాటు నిరసన కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు భారీఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చందన, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దేవీ రవీందర్‌, బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ మండల శాఖ అధ్యక్షుడు బెండె మధు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement