విద్యార్థినుల రాస్తారోకో
సిద్దిపేటకమాన్: రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 96ను రద్దు చేయాలని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ జీవో వల్ల ఇంజనీరింగ్ చేయాల్సిన తాము పరిశ్రమల్లో కూలీలుగా మారాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ పూర్తయ్యాక ఎంట్రెన్స్ రాసి బీటెక్ అడ్మిషన్ పొందేవాళ్లమని కానీ శక్తి పథకం వల్ల ఇలాంటి అవకాశాన్ని కోల్పోతామన్నారు.


