పుణ్య తీరం.. దోపిడీ తీర్థం | - | Sakshi
Sakshi News home page

పుణ్య తీరం.. దోపిడీ తీర్థం

Jul 25 2026 7:21 AM | Updated on Jul 25 2026 7:21 AM

కనిపించని నేతి దీపం

ఏడుపాయల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కబేలా.. దోపిడీకి అడ్డాగా మారింది. రూ.300 విలువ చేసే కోడి కోయాలంటే రూ.200 వసూలు చేస్తున్నారు. మేక, గొర్రెలకై తే బరువును బట్టి కాకుండా కాంట్రాక్టర్‌ చెప్పిందే ధర. ఇక కొబ్బరికాయల విక్రయాల్లో సైతం నేతి దీపాలు ఇవ్వడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొక్కులు మొక్కి, మూట గట్టుకొని తెచ్చిన ఒడి బియ్యం సమర్పణలో సైతం కాంట్రాక్టర్‌ బలవంతపు కట్నాలు వసూలు చేస్తున్నాడని భక్తులు చెబుతున్నారు. దుర్గమ్మ సాక్షిగా భక్తుల నిలువు దోపిడీ కొనసాగుతున్నా.. ఆలయ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

– పాపన్నపేట(మెదక్‌)

దుర్గమ్మసాక్షిగాబరితెగింపు

నిబంధనలకువిరుద్ధంగాకబేలా నిర్వహణ

తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఏడుపాయలకు నిత్యం వేలాది భక్తులు వస్తుంటారు. మందు, విందు అక్కడ నిత్యకృత్యం. అయితే ఇక్కడ జంతు బలి నిషేధం. గతంలో భక్తులు ఎక్కడ బడితే అక్కడే మేకలు, గొర్రెలు కోసే వారు. దీంతో 2019లో అనధికారికంగా అప్పటి పాలకవర్గం కబేలా కోసం ఒక పర్మనెంట్‌ షాప్‌ నిర్మించి, ఐదేళ్ల పాటు ఎలాంటి రుసుము లేకుండా నిర్వహించుకోవాలని తీర్మానం చేసింది. మేకకు 10 కిలోల లోపు రూ.400, 10–20 కిలోల లోపు రూ.500, 20 కిలోలపై రూ.600 వసూలు చేయాలని నిర్ణయించారు. ఒక్కో మూగ జీవిపై రూ.25 దేవస్థానానికి ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు మెదక్‌కు చెందిన కాంట్రాక్టర్‌ ఒప్పందం చేసుకొని 2024 వరకు నిర్వహించాడు. నిర్ణయించిన సమయం పూర్తి కావడంతో అతడిని తొలగించాలని కోరుతూ నాగ్సాన్‌పల్లి గ్రామస్తులు కబేలా ఎదుట ధర్నా నిర్వహించారు. దీంతో ఆలయ అధికారులు కబేలా సీజ్‌ చేసి, స్థానిక వ్యాపారులకు అవకాశం కల్పించారు. అయితే తాను కరోనా సమయంలో నష్టపోయినందున, తనకు సమయం పెంచాలని కోరుతూ అతడు కోర్టుకు వెళ్లాడు. కాగా, ఇటీవల ఆలయ అధికారులు, కాంట్రాక్టర్‌తో మాట్లాడి కోర్టు కేసు విత్‌ డ్రా చేయించారు. రెండు నెలల క్రితం తిరిగి కబేలా నిర్వహణ అతడికే అప్పగించారు. దీంతో సదరు కాంట్రాక్టర్‌ మేకలు, గొర్రెలకు బరువును బట్టి కాకుండా, తనకు ఇష్టమొచ్చిన రీతిలో రూ.700 నుంచి 1,000 వరకు వసూలు చేస్తున్నాడన్న ఆరోపణలున్నాయి. ఇక రూ.300 కోడిని, కట్‌ చేయడానికి రూ.200 తీసుకుంటున్నారు. దేవస్థానానికి మాత్రం మేకకు రూ.50 టికెట్‌ తీసుకోవాల్సి ఉంది.

ఒడి బియ్యం సమర్పణలోనూకట్నాల వసూలు

ఏడుపాయల్లో

కాంట్రాక్టర్ల

ఇష్టారాజ్యం

ఇక ఇదే కాంట్రాక్టర్‌కు కొబ్బరికాయల కాంట్రాక్ట్‌ సైతం ఉంది. కొబ్బరికాయను నెయ్యి దీపంతో కలిపి రూ.50కి విక్రయించాలి. కానీ నెయ్యి దీపం లేకుండా అమ్ముతున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో ఒడి బియ్యం కాంట్రాక్టర్‌ సైతం భక్తుల నుంచి కట్నం పేరిట రూ.100 నుంచి 200 బలవంతంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. చేతికి కట్టే దారానికి రూ.10 నుంచి 20 వరకు దండుకుంటున్నారని భక్తులు అంటున్నారు. ధర్మ సత్రాలు కేటాయించడంలో కూడా ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలా దుర్గమ్మ సాక్షిగా ఏడుపాయలకు వచ్చే భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఈ విషయమై ఈఓ వీరేశంకు ఫోన్‌లో వివరణ కోరగా స్పందించలేరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement