వేతన బకాయిలివ్వండి | - | Sakshi
Sakshi News home page

వేతన బకాయిలివ్వండి

Jul 25 2026 7:21 AM | Updated on Jul 25 2026 7:21 AM

వేతన బకాయిలివ్వండి గజ్వేల్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్ల హెల్ప్‌డెస్క్‌ దరఖాస్తులు ఆహ్వానం మందుబాబులకు జరిమానా

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రసాదరావు

గజ్వేల్‌: గజ్వేల్‌లోని ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఏడాది కాలంగా వేతనాలు చెల్లించకపోవడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాదరావు మండిపడ్డారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను శుక్రవారం సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కార్మికులకు ఇప్పటికే అతి తక్కువ వేతనాలు అమలు చేస్తున్నారన్నారు. అవీ కూడా సకాలంలో అందజేయడం లేదని ఇప్పటికై నా అధికారులు స్పందించి వేతనాలు అందజేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల ఇబ్బందులను తెలుసుకున్న గజ్వేల్‌ లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ మేధా, లయన్స్‌ క్లబ్‌ రీజియన్‌ చైర్మన్‌ జిల్లా రమేశ్‌ ఆధ్వర్యలో నిత్యావసరాలను అందజేయడానికి ముందుకురాగా...ఆ ప్యాకెట్లను ప్రసాదరావు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గాడిపల్లి భాస్కర్‌, బీఎంఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరాఠి కృష్ణమూర్తి, బీజేపీ నాయకులు పేర్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్షకు మద్దతుగా..

గజ్వేల్‌రూరల్‌: నీట్‌ పేపర్‌ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆమరణ దీక్ష చేస్తున్న సోనమ్‌ వాంగ్‌చుక్‌కు మద్దతుగా గజ్వేల్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థి, ఉపాధ్యా, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. నీట్‌ పేపర్‌ లీకేజీకి కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ, రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడవద్దని, నీట్‌ పేపర్‌ లీకేజీతో నష్టపోయిన వారికి న్యాయం చేయాలని కోరారు.

ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ భగవంత్‌రావు

సిద్దిపేటరూరల్‌: ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పా టు చేశారు. ఈ మేరకు జిల్లా హౌసింగ్‌ కార్పొరేషన్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ భగవంత్‌రావు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ పథకానికి సంబంధించిన అర్హతలు, ధ్రువపత్రాల సమర్పణ, చెల్లింపులు, ఇళ్ల నిర్మా ణం, సాంకేతిక అంశాలు, ఇతర సందేహాల నివృతి కోసం హెల్ప్‌డెస్క్‌ సేవలను లబ్ధిదారులు వినియోగించుకోవాలని సూచించారు. లబ్ధిదారులు టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 599 5991కు కాల్‌ చేయవచ్చని, 08457–224753 ద్వారా ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు సహాయం పొందవచ్చని తెలిపారు. అవసరమైతే సమీప హెల్ప్‌ డెస్క్‌ కేంద్రాన్ని కూడా సంప్రదించి తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చన్నారు.

చేర్యాల(సిద్దిపేట): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సీటీలో డిగ్రీ పూర్తిచేసేందుకు నోటిఫికేషన్‌ విడుదలైనట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రణీత, అధ్యయన కేంద్రం సమన్వయకర్త రజిని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీఏ, బీకామ్‌, బీఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, అర్హులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సిద్దిపేటకమాన్‌: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. ట్రాఫిక్‌ సీఐ ముత్యంరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌లో 37 మంది పట్టుబడ్డారు. వారిని కోర్టులో హాజరుపర్చగా శుక్రవారం విచారణ జరిపిన న్యాయమూర్తి వారికి రూ.4.06 లక్షలు జరిమానా, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన 31 మందికి రూ.1.55 లక్షలు జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement