సమీకృత స్కూల్‌ పనులు వేగిరం | - | Sakshi
Sakshi News home page

సమీకృత స్కూల్‌ పనులు వేగిరం

Jul 25 2026 7:21 AM | Updated on Jul 25 2026 7:21 AM

కలెక్టర్‌ హైమావతి

కోహెడరూరల్‌(హుస్నాబాద్‌): మండలంలోని తంగళ్లపల్లి గ్రామ శివారులో రూ.200 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ హైమావతి స్పష్టం చేశారు. కోహెడ మండలంలో జిల్లా కలెక్టర్‌ హైమావతి శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. తెలంగాణ సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్‌ కళాశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. మొదట తంగళ్లపల్లి శివారులో దాదాపు 23 ఎకారల విస్తీర్ణంలో జరుగుతున్న భారీ విద్యాసంస్థ నిర్మాణ పనులను కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ ప్రాంతమంతా కలియతిరిగి పనుల పురోగతిని చూసిన ఆమె రాష్ట్రంలోనే నిర్మాణ వేగంలో ఖమ్మం జిల్లాతో సమానంగా సిద్దిపేట అగ్రస్థానంలో కొనసాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఎలాంటి ఇటుకలు వాడకుండా ఆధునాతన మైవాన్‌ టెక్నాలజీతో ఈ కాంప్లెక్స్‌ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌ రాష్ట్రానికి ఒక రోల్‌ మోడల్‌గా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. అనంతరం కోహెడలోని బాలుర కళాశాలను సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అక్కడి వండిన అన్నం,క్యాజేజీ కూర, పప్పు రసం, పెరుగును రుచి చూశారు. ప్రభుత్వం నిర్దేశించిన కామన్‌ డైట్‌మెనూను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. అనంతరం పాఠశాల స్టాక్‌ రిజిస్టర్‌ను తనిఖీ చేసిన కలెక్టర్‌ రికార్డులను సక్రమంగా రాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట సిబ్బందికి సరుకులు అందించే ముందు మెస్‌ కమిటీ సమక్షంలో కొలతల ప్రకారం పారద్శకంగా ఇవ్వాలని అలా కాకుండా జూనియర్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయులు వంట సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేంది లేదని హెచ్చరించారు. రికార్డులు రాకయపోవడంపై తక్షణమే విచారణ జరపాలని డీసీఓను ఫోన్‌ ద్వారా ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement