పడని వర్షం.. | - | Sakshi
Sakshi News home page

పడని వర్షం..

Jul 24 2026 7:19 AM | Updated on Jul 24 2026 7:19 AM

రైతు నేస్తాలను కాపాడుదాంమితిమీరిన రసాయన మందులవినియోగంతో మిత్ర పురుగులు, పక్షులు కనుమరుగవుతున్నాయి. వివరాలు 8లో u శుక్రవారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2026

న్యూస్‌రీల్‌

రైతు నేస్తాలను కాపాడుదాంమితిమీరిన రసాయన మందులవినియోగంతో మిత్ర పురుగులు, పక్షులు కనుమరుగవుతున్నాయి. వివరాలు 8లో u
ప్రత్యామ్నాయ పంటల వైపు మరలేనా?

వీడని భయం

సాక్షి, సిద్దిపేట: జిల్లాలో సాధారణంగా ఖరీఫ్‌లో 5.40 లక్షల పంటలు సాగయ్యే అవకాశముందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో వరి 3.60 లక్షల ఎకరాలు, పత్తి 1.18 లక్షలు, మిగతా పంటలు 62వేలలో సాగయ్యే అవకాశాలున్నాయని ముందుగా ప్రకటించింది. ఎల్‌నినో ప్రభావంతో సాగు అనుకున్నంతస్థాయిలో కావడం లేదు. లోటువర్షపాతం ఉండటంతో ప్రత్యామ్నాయ పంటలు వేయాలని జిల్లా యంత్రాంగం సూచిస్తోంది.

ఇప్పటివరకు కేవలం 34 శాతమే

జిల్లాలో ఇప్పటివరకు 1,83,710 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. అందులో పత్తి అత్యధికంగా 1,01,009 ఎకరాల్లో వేయగా, 57,093 ఎకరాల్లో వరి, 24,509 ఎకరాల్లో మొక్కజొన్న, మిగతా పంటలు 1,099 మాత్రమే సాగుచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ అంచనా వేసిన దాంట్లో కేవలం 34% మాత్రమే పంటలు వేశారు. వరి పంటల సాగు నుంచి రైతులను ఆరుతడి పంటల వైపు కొత్తగా 1.25లక్షల ఎకరాలు మళ్లీంచాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు.

41 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు

జిల్లా వ్యాప్తంగా ఉద్యాన పంటలు ప్రస్తుతం 41వేల ఎకరాల్లో సాగవుతుండగా మరో 11,970 ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం కేవలం ఆయిల్‌పామ్‌కు సంబంధించిన మొక్కలు మాత్రమే అందుబాటులో ఉండగా మిగతా పండ్ల మొక్కలు, కూరగాయల విత్తనాలను రైతులే ఏర్పాటు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం విత్తనాలు అందుబాటులో ఉంచితే కూరగాయ పంటలు సాగయ్యేవని రైతులు అభిప్రాయపడుతున్నారు.

ఓ వైపు వర్షాలు లేకపోవడం, మరోవైపు ఆరుతడి పంటలను వేస్తే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో లేదననే భయాందోళనలు రైతులను వెన్నాడుతున్నాయి.ప్రస్తుతం అన్నదాతల చూపంతా ఆకాశం వైపే ఉంది. వర్షాలు ఆశించిన స్థాయిలో కురిసే పరిస్థితి లేకపోవడంతో ఆరుతడి పంటలే వేయాలని జిల్లా యంత్రాంగం, వ్యవసాయ శాఖ గ్రామాల్లో అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. ఈ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలను సాగు చేస్తారా? వరి సాగుకే మొగ్గుచూపుతారా? లేక ఏ పంటలు వేయకుండా వదిలేస్తారా? అనేది చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement