చిన్నకోడూరు(సిద్దిపేట): గోదావరి నీటిని విడుదల చేసి రంగనాయక సాగర్ రిజర్వాయర్ నింపాలని గ్రామ సభల్లో గురువారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. చిన్నకోడూరు, పెద్దకోడూరు, గంగాపూర్ గ్రామాల్లో గురువారం నిర్వహించిన గ్రామసభల్లో గ్రామస్తులు, వార్డు సభ్యులు, సర్పంచ్‌లు రంగనాయక సాగర్‌కు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఏక గ్రీవ తీర్మానం చేసి తహసీల్దార్, ఎంపీడీఓలకు సదరు పత్రాలు అందజేశారు. కళ్ల ముందు నారుమడులు ఎండిపోతుంటే రైతులు ఆందోళన చెందుతున్నారని, నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.


