సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని 33 పీఎంశ్రీ స్కూళ్లకు యోగా టీచర్లను నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది నుంచి పీఎం శ్రీ స్కూళ్లలో యోగాను నేర్పిస్తున్నారు. ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభమై 40 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు యోగా టీచర్లను నియమించలేదు. దీంతో విద్యార్థు లు యోగాకు దూరమవుతున్నారు. పీఎంశ్రీ స్కూళ్ల లో యోగా టీచర్ నియామకం కోసం నెలకు రూ. 10 వేల బడ్జెట్‌ను కేటాయిస్తోంది. గతేడాది నెలకు రూ.8వేల చొప్పున రూ.80వేలను జమ చేశారు. కానీ విద్యాశాఖ నిర్లక్ష్యంతో చివరి నాలుగు నెలలు మాత్రమే యోగా టీచర్‌ను నియమించారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి యోగా టీచర్లను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


