వంగ మహేందర్‌రెడ్డి
సిద్దిపేటరూరల్: రాష్ట్ర ప్రభుత్వం 55% ఫిట్‌మెంట్‌తో కొత్త పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని పీఆర్‌టీయూ టీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగ మహేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నారాయణరావుపేట మండల పరిధిలోని జక్కాపూర్, గుర్రాలగోంది, తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల, నారాయణరావుపేట, లక్ష్మిదేవిపల్లి, గోపులాపూర్, ఏదుల్లవాడ తదితర పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వంగ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ..పీఆర్‌సీని తక్షణమే ప్రకటించి, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు.


