● తాగునీటి ట్యాంక్ పనులు త్వరితగతిన జరగాలి
● వర్షాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణ బాగుండాలి
● మున్సిపల్ అధికారులతో మాజీమంత్రి హరీశ్‌రావు సమీక్ష
సిద్దిపేటజోన్: జిల్లాలో ఏకై క స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్దిపేటలో ఒక్క అసిస్టెంట్ ఇంజనీరు, ఒక్క శానిటరీ ఇన్‌స్పెక్టర్‌తో పనులు ఎలా జరిగేది? రెగ్యులర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వెంటనే అధికారులను నియమించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు మున్సిపల్ ఉన్నతాధికారులను ఫోన్ ద్వారా కోరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ అభివృద్ధి పనులపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ పనుల స్థితిగతులు గురించి ఆరా తీశారు. నలుగురు అసిస్టెంట్ ఇంజనీర్లకుగాను ఒక్కరే విధుల్లో ఉండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖాళీల వల్ల మున్సిపాలిటీ పనులెలా నడుస్తాయని ప్రశ్నించారు. మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఈఎన్‌సీకి ఫోన్ చేసి ఇంజనీరింగ్ పనుల వేగవంతం కోసం అసిస్టెంట్ ఇంజనీర్లను ఏర్పాటు చేయాలని కోరారు. పట్టణంలో మిగిలిన యూజీడీ పనులను వెంటనే ప్రారంభించాలని, ఇందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అనంతరం చెరువుల పనులను వేగవంతం చేయాలని, వివిధ కూడళ్లలో అభివృద్ధి పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్‌కు సూచించారు. పట్టణంలో నిర్మిస్తున్న నీటిట్యాంక్‌ల పనులను పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. వర్షాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా అమలు చేయాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. మున్సిపాలిటీలో సేవలు పారదర్శకంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, డీఈ ప్రేరణ పాల్గొన్నారు.


