మత్తు పదార్థాలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

మత్తు పదార్థాలపై అవగాహన అవసరం

Jul 15 2026 12:05 PM | Updated on Jul 15 2026 12:05 PM

రాజన్న జోన్‌–3 డీఐజీ సున్‌ప్రీత్‌సింగ్‌

రాజన్న జోన్‌–3 డీఐజీ సున్‌ప్రీత్‌సింగ్‌

సిద్దిపేటకమాన్‌: గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగంపై యువత, ప్రజల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని రాజన్న జోన్‌ 3 డీఐజీ సున్‌ప్రీత్‌సింగ్‌ ఆదేశించారు. పోలీసు కమిషనరేట్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించి, కమిషనర్‌ కార్యాలయ ఆవరణలో సీపీతో కలిసి మొక్కను నాటారు. శాంతిభద్రతలు, నేరాలపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. సైబర్‌ నేరాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. షీ టీమ్స్‌ పనితీరుపై మహిళలు, విద్యార్థినులకు మరింత అవగాహన కల్పించాలని, ఎస్‌హెచ్‌ఓలు తమ పరిధిలో క్రమం తప్పకుండా వాహన తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు డీసీపీలు కుశాల్కర్‌, సుభాష్‌ చంద్రబోస్‌, ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement